CBSE Class 12 Result 2021: సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్, 12 తరగతుల ఫలితాలను వాయిదా వేసింది. ఈద్ పండుగ సందర్భంగా పరీక్షా ఫలితాలు విడుదల చేయడం లేదని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.

CBSE Class 12 Result 2021: సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా..  మళ్లీ ఎప్పుడంటే?

Cbse Class 12 Result 2021

Updated On : July 21, 2021 / 7:04 PM IST

CBSE class 12th Results : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్, 12 తరగతుల ఫలితాలను వాయిదా వేసింది. ఈద్ పండుగ సందర్భంగా పరీక్షా ఫలితాలు విడుదల చేయడం లేదని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. CBSE 12వ తరగతి ఫలితాల చివరి తేదీని జూలై 25 సాయంత్రం 5 వరకు పొడిగించింది. గడువు సమయంలోగా ఫలితాల వెల్లడికి సీబీఎస్ఈ పరీక్షా విభాగం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని సీబీఎస్ఈ తెలిపింది.

ఈద్ గెజిట్‌లో మాత్రమే సెలవు రోజుగా పేర్కొంది. CBSE అధికారులకు మాత్రం సెలవు లేదని స్పష్టం చేసింది. 12వ తరగతి ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని పరీక్షా కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. ఈమెయిల్, వాట్సాప్ ద్వారా పాఠశాలల నుంచి వచ్చిన ప్రశ్నలకు సంబంధించి జాబితాను విడుదల చేస్తామని CBSE వెల్లడించింది. 2020లో టెన్త్ రిజల్ట్స్ జూలై 15న ప్రకటించారు.


గత ఏడాదిలో కరోనావైరస్ వ్యాప్తి సమయంలో బోర్డు 10వ తరగతి పరీక్షలను నిర్వహించింది. ఫలితాలను ప్రకటించారు. ఈసారి పరీక్షలు నిర్వహించలేకపోయింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని CBSE ప్రత్యామ్నాయ మార్కింగ్ స్కీమ్ రూపొందించింది. CBSE 11, 12 థియరీ మార్కుల మోడరేషన్ కోసం టేబులేషన్ పోర్టల్‌ను కూడా ఓపెన్ చేసింది. పట్టిక పోర్టల్ cbse.gov.inలో అందుబాటులో ఉంది.