Cipet Admission : సిపెట్ అడ్మిషన్ టెస్ట్ 2022 నోటిఫికేషన్

అయా కోర్సుల్లో ప్రవేశానికి అర్హతల విషయానికి వస్తే కోర్సులను అనుసరించి పదోవతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.

Cipet Admission : సిపెట్ అడ్మిషన్ టెస్ట్ 2022 నోటిఫికేషన్

Cipet

Cipet Admission : చెన్నైలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో 2022 విద్యా సంవత్సారానికి పలు ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. కోర్సుల వివరాలకు సంబంధించి డిప్లోమా ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమా ప్లాస్టిక్స్ టెక్నాలజీ, పోస్ట్ డిప్లోమా ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్, క్యామ్, పీజీ డిప్లోమా ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్, తదితర కోర్సులు ఉన్నాయి.

అయా కోర్సుల్లో ప్రవేశానికి అర్హతల విషయానికి వస్తే కోర్సులను అనుసరించి పదోవతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. ఇక ఎంపిక విధానికి వస్తే కంప్యూటర్ బేస్ట్ పరీక్ష అధారంగా ఎంపికను నిర్వహిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 5, 2022గా నిర్ణయించారు. అడ్మీషన్ టెస్ట్ ను జూన్ 19, 2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ WWW.cipet.gov.in/ సంప్రదించాలి.