Job Vacancies : సీఎస్ఐఆర్ ఐఐసీటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌ కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్,సివిల్ మెకానికల్,ఎలక్ట్రికల్, ఫైర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డిప్లొమా ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూలను 5 ఆగస్టు 2022 తేదీన నిర్వహించనున్నారు.

Job Vacancies : సీఎస్ఐఆర్ ఐఐసీటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

Job Vacancies : హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేస్తారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఖాళీ, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 ఖాళీలు, ప్రాజెక్ట్ అసోసియేట్ 3 ఖాళీలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్‌ కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్,సివిల్ మెకానికల్,ఎలక్ట్రికల్, ఫైర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డిప్లొమా ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూలను 5 ఆగస్టు 2022 తేదీన నిర్వహించనున్నారు. ఉప్పల్‌ రోడ్‌, ఐఐసీటీ కాలనీ, తార్నక, హైదరాబాద్‌ చిరునామాలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iict.res.in/ పరిశీలించగలరు.