Border Roads Organisation : బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

రాత పరీక్ష, శారీరక కొలత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు నిర్ణీత అర్హతలలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు, ఒరిజినల్ పత్రాలను తనిఖీ చేసి ఎంపిక చేస్తారు.

Border Roads Organisation : బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

Border-Roads-Organisation (1)

Border Roads Organisation : బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 246 పోస్టులు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో 14 డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులు, 7 సూపర్‌వైజర్ పోస్టులు, 13 సూపర్‌వైజర్ సైఫర్ పోస్టులు, 9 సూపర్‌వైజర్ స్టోర్ పోస్టులు, 10 హిందీ టైపిస్ట్ పోస్టులు, 35 కమ్యునిక్ ఆపరేటర్ పోస్టులు. , 30 ఎలక్ట్రీషియన్ పోస్టులు, 24 వెల్డర్ పోస్టులు, 22 మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు మరియు 82 మల్టీ స్కిల్డ్ వర్కర్ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేషన్) పోస్టుకు SSLC, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మల్టీ స్కిల్డ్ వర్కర్ (నర్సింగ్ అసిస్టెంట్)పోస్టులకు ఇంటర్ సైన్స్‌తో పాటు ఏడాది నర్సింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) పోస్టుకు పోస్టుకు సంబంధించిన ట్రేడ్‌లో ఐటీఐతోపాటు ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులై ఉండాలి. స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టుకు ఏదైనా సబ్జెక్టులో పీయూసీతో స్టోర్ కీపింగ్ అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు కూడా ఎస్‌ఎస్‌ఎల్‌సీతోపాటు ఐటీఐ ఉత్తీర్ణులై
ఉండాలి.

రాత పరీక్ష, శారీరక కొలత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు నిర్ణీత అర్హతలలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు, ఒరిజినల్ పత్రాలను తనిఖీ చేసి ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 11, 2022 దరఖాస్తుకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bro.gov.in/ పరిశీలించగలరు.