10వ తరగతి పరీక్షలల్లో టాప్ ర్యాంకు… రోజు 24 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వెళ్లేది

  • Published By: Chandu 10tv ,Published On : July 6, 2020 / 05:30 PM IST
10వ తరగతి పరీక్షలల్లో టాప్ ర్యాంకు… రోజు 24 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వెళ్లేది

భారతదేశంలో కరోనా వైరస్ విజృభిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు మూతపడ్డాయి. ఈ మహమ్మారి దెబ్బకు అనేక రాష్ట్రాల్లో 10వ తరగతితో పాటు ఇతర పరీక్షలను రద్దు చేయటంతో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ హ్యాపీగా గంతులేశారు. మధ్య ప్రదేశ్ లో ఓ అమ్మాయి ప్రతి రోజు 24 కిలో మీటర్లు సైకిల్ పై ప్రయాణించి 10వ తరగతి పరీక్షలు రాసింది. మహారాష్ట్ర బోర్డు శనివారం(జూలై 4, 2020) విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో రోష్ని 98.5 శాతం మార్కులు సాధించింది రాష్ట్ర స్ధాయిలో 8వ ర్యాంకు సాధించింది. అమ్మాయి పట్టుదల, ఆమె సాధించిన మార్కులు చూసిన దేశ ప్రజలు సలామ్ చెల్లెమ్మా అంటున్నారు.

మధ్యప్రదేశ్ లోని బింద్ జిల్లాలోని అజ్నోల్ గ్రామంలో రోష్ని భడోరియా(15) నివాసం ఉంటుంది. ఆమె ఉంటున్న ప్రాంతాన్నికి 12 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (హై స్కూల్) 10వ తరగతి చదువుకుంది. అక్కడికి వెళ్లేందకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రోష్ని స్కూల్ కు వెళ్లిరావడానికి ప్రతిరోజు రోష్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు పంపిణి చేసిన సైకిల్ మీద 24 కిలోమీటర్లు ప్రయాణం చేసేది. అంత అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ రోజు నాలుగున్నర గంటల పాటు చదువుకునేదాన్ని, తనకి IAS కావాలనకుంటున్నాను అని రోష్నిని తెలిపింది. తనకు ఇంత మంచి ర్యాంకు వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని, తండ్రి ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను చదువు పై పూర్తి శ్రద్ద పెట్టగలిగానని ఆమె తెలిపింది.

రోష్నీ తండ్రి పురుషోత్తం భడోరియా ఒక రైతు. తన కుమారై సాధించిన విజయంతో కుటుంబమంతా గర్వించేలా చేసిందని ఆయన తెలిపారు. తల్లి శ్రేతా భడోరియా మాట్లాడుతూ, తన కుమారై ఐఎఎస్ కావాలనే తన కలలను సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.

Read Here>>హెయిర్ స్టైల్ తో ఫోజులు కొడుతున్న ఏనుగు : ఆహా..ఏమి స్టైల్ గజరాజా..అంటున్న నెటిజన్స్