చైనా తర్వాత మనమే : అమెరికాకు 2లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు

  • Published By: sreehari ,Published On : November 18, 2019 / 09:10 AM IST
చైనా తర్వాత మనమే : అమెరికాకు 2లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు

విదేశాల్లో విద్య కోసం స్వదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి వైద్యవిద్య కోసం వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ అమెరికాలో చదువు కోసం భారత్ నుంచి వెళ్లిన విద్యార్థుల్లో లక్షల్లో ఉన్నారు. 2018-19 విద్యాసంవత్సరంలో భారత్ నుంచి అమెరికాలో విద్య కోసం పంపిన విద్యార్థుల్లో 2లక్షల మందికి పైగా ఉన్నట్టు ఓ రిపోర్టు వెల్లడించింది.

ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ పై 2019 ఓపెన్ డోర్స్ రిలీజ్ చేసిన రిపోర్టు తెలిపింది. ఇదే విద్యాసంవత్సరంలో అమెరికాలో విదేశీ విద్యార్థులను వరుసగా 10వ ఏడాది కూడా అధిక సంఖ్యలో పంపిన అతిపెద్ద దేశంగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. 

2018-19 విద్యాసంవత్సరంలో వరుగా నాల్గో ఏడాది అమెరికాలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ఆల్ టైమ్ అత్యధికంగా ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. 2018లో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి 44.7 బిలియన్ (USD) డాలర్లకు పెరిగేలా అంతర్జాతీయ విద్యార్థులు సహకారం అందించారని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్ డేటా తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే   5.5శాతం పెరిగినట్టు పేర్కొంది. ఇదే విద్యాసంవత్సరంలో వరుసగా 10వ ఏడాదిలో చైనా 3లక్షల 69వేల 548 మంది విద్యార్థులను అమెరికాకు పంపింది. 

అదే భారత్ నుంచి 2లక్షల 02వేల 014 మంది విద్యార్థులను అమెరికాకు పంపిన రెండో అతిపెద్ద దేశంగా నిలిచినట్టు రిపోర్టు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో అంతర్జాతీయ విద్యార్థుల మొత్తం సంఖ్య 0.05శాతంగా పెరిగి 10లక్షల 95వేల 299 మంది విద్యార్థులు వెళ్లారు. ఇందులో మొత్తం అమెరికా ఉన్నత విద్య జనాభా అంతర్జాతీయ విద్యార్థులతో 5.5శాతానికి పెరిగింది.

విదేశీ విద్యార్థుల్లో భారత్, చైనా నుంచి 50శాతానికి పైగా అమెరికా వెళ్తున్నారని రిపోర్టు పేర్కొంది. ఈ రిపోర్టును ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (IIE) అండ్ యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్, బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ రిలీజ్ చేసింది.