ICG-2019 గెజిటెడ్ ఆఫీస‌ర్‌ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : May 13, 2019 / 07:31 AM IST
ICG-2019 గెజిటెడ్ ఆఫీస‌ర్‌ పోస్టులు

ఇండియ‌న్ కోస్ట్ గార్డు (ICG)లో అసిస్టెంట్ క‌మాండెంట్ (గ్రూప్-A గెజిటెడ్ ఆఫీసర్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా పోస్టుల విద్యా అర్హతలు నిర్ణయించారు. మే 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం: 
అర్హతగల అభ్యర్థులను రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  

విద్యా అర్హత:
60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (BE, B-TECH) చదివి ఉండాలి. చివరి సెమిస్టర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. 

ముఖ్యమైన తేదీలు.. 
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 24.05.2019 
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 04.06.2019 
* అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 14.06.2019