IIOR Recruitment : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీఎంఏఐ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టర్వ్యూ లేదా టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలో సాధించిన మార్కులు, టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

IIOR Job Vacancies
IIOR Recruitment : ఐకార్ ఆధ్వరంలో పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్ (IIOR)లో పలు పోస్టుల భర్తీకి చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్‌లో ఉన్న యంగ్‌ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీఎంఏఐ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టర్వ్యూ లేదా టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలో సాధించిన మార్కులు, టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
READ ALSO : Diabetes and headaches : తలనొప్పి అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణమా?
ఇంటర్వ్యూలను హైదారాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్‌లో నిర్వహిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను sao.iior@icar.gov.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఈ రోజుతో అనగా18 జూన్ 2023తో గడువు ముగియనుంది. ఇంటర్వ్యూలను ఈనెల 20,21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://icar-iior.org.in/ పరిశీలించగలరు.