ఇన్ఫీటీక్యూ యాప్‌తో ఇంజినీరింగ్ చదువులు

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 03:45 AM IST
ఇన్ఫీటీక్యూ యాప్‌తో ఇంజినీరింగ్ చదువులు

ఇంజనీరింగ్ విద్యార్థులకోసం దేశంలో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా విడుదల చేసిన ఇన్ఫీటీక్యూ యాప్ ద్వారా ఆయా విద్యార్థుల చదువులకు సంబంధించిన కీలక అంశాలను నేర్చుకోవచ్చని సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న మూడు, నాలుగో సంవత్సరం(ఇంజినీరింగ్) చదువుతున్న విద్యార్థులు ఈ యాప్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. 

విద్యార్థులు ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడైన చదువుకోవడానికి వీలుగా ఇన్ఫీటీక్యూను తీర్చిదిద్దినట్లు, తద్వారా డిజిటల్ స్కిల్స్‌ను పెంపొందించడానికి ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఏకోసిస్టమ్‌ను తీర్చిదిద్దింది. అలాగే ఆర్గనైజేషన్లతో విద్యార్థులు నేరుగా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. తమ కోర్సులకు సంబంధించి టెక్నాలజీ ద్వారా ప్రాక్టికల్ అస్పెక్ట్స్‌ను కూడా నేర్చుకోవచ్చును. ఈ యాప్ ద్వారా అడ్వాన్స్ మెటిరియల్‌ను ప్రొవైడ్ చేస్తున్నట్లు, టెక్నికల్ స్కిల్స్‌కు సంబంధించి వర్చ్యూవల్ ప్రొగ్రామింగ్ పరిస్థితులను క్రియేట్ చేయనున్నది.