Inter Exams : తెలంగాణలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగనున్నాయి.

Inter Exams : తెలంగాణలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు

Exam 11zon

Telangana Inter exams : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. రాష్ట్రంలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. మే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం (మార్చి 16,2022) విడుద‌ల చేసింది.

Inter Exams Schedule 11zon

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగనున్నాయి. జీఈఈ మెయిన్స్-2022 పరీక్షల దృష్ట్యా ఇంటర్ షెడ్యూల్ లో మార్పులు చేశారు.

Telangana: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫెయిలైనవారంతా పాస్!

ఇంటర్ ఫ‌స్టియ‌ర్ పరీక్షల షెడ్యూల్
మే 6(శుక్ర‌వారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 9(సోమ‌వారం) – ఇంగ్లీష్
మే 11(బుధ‌వారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్
మే 13(శుక్ర‌వారం) – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
మే 16(సోమ‌వారం) – ఫిజిక్స్, ఎక‌నామిక్స్
మే 18(బుధ‌వారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
మే 20 (శుక్ర‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1
మే 23(సోమ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

ఇంటర్ సెకండియ‌ర్ పరీక్షల షెడ్యూల్
మే 7(శ‌నివారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 10(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్
మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్
మే 14(శ‌నివారం) – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
మే 17(మంగ‌ళ‌వారం) – ఫిజిక్స్, ఎక‌నామిక్స్
మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
మే 21 (శ‌నివారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2
మే 24(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి