JEE: జేఈఈ 4వ సెషన్ పరీక్షలు

ఐఐటీ (IIT), ఎన్ఐటీ  (NIT) తదితర జాతీయ విద్యా సంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE - MAIN) 2021 4వ సెషన్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

JEE: జేఈఈ 4వ సెషన్ పరీక్షలు

Jee

JEE 4 Session Exam : ఐఐటీ (IIT), ఎన్ఐటీ  (NIT) తదితర జాతీయ విద్యా సంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE – MAIN) 2021 4వ సెషన్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ పరీక్షలు 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి మేలో జరగాల్సిన పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ ఆధారంగా ఈ పరీక్షలు జరుగుతాయనే సంగతి తెలిసిందే.

Read More : UGC Scholarship : ఏటా రూ.36,200.. అమ్మాయిలకు మాత్రమే.. ఇలా అప్లయ్ చేసుకోండి

సెప్టెంబర్ 02వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని తెలుస్తోంది. ఫస్ట్ డే పేపర్ – 2 బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరుగనున్నాయి. బీటెక్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు..ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 01, 02వ తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్ లుగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. జేఈఈ మెయిన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్స్ లలో నిర్వహిస్తున్నారు. స పరీక్షలు నిర్వహణ అనంతరం సెప్టెంబర్ మూడో వారంలో తుది విడత ఫలితాలు, అభ్యర్థుల ర్యాంకులను ఎన్ టీ ఏ (NTA) ప్రకటించనుంది.