JOBS : ఆర్కేపురం ఆర్మీపబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తోపాటు డీఈడీ, బీఈడీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

JOBS : ఆర్కేపురం ఆర్మీపబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ

Rk Puram Armypublic School

JOBS : తెలంగాణా రాష్ట్ర పరిధిలోని సికిందరాబాద్ ఆర్కేపురం లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి పీజీటీ 7ఖాళీలు, టీజీటీ 20 ఖాళీలు, పీఆర్ టీ 18 ఖాళీలు ఉన్నాయి. సైకాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, జాగ్రఫీ, సోషల్ సైన్స్, మ్యాథ్స్, మ్యూజిక్, డ్యాన్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తోపాటు డీఈడీ, బీఈడీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదిగా జూన్ 6, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://apsrkpuram.edu.in/ పరిశీలించగలరు.