UPSC : యూపీఎస్సీ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకుగాను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్,కామర్స్,సైన్స్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

Upsc Jobs
UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న వాటిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 4 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ యునానీ 25 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకుగాను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్,కామర్స్,సైన్స్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనానీకి సంబంధించి యునానీ మెడిసిన్ లో డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు మార్చి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఆఫీసర్ ఖాళీల కోసం అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 ఏళ్లుగా నిర్ణయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనానీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.25 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ,పిడ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.upsc.gov.in/సంప్రదించగలరు.