IIITDM Kurnool : ఐఐఐటీడీఎం కర్నూల్ లో పీహెచ్ డీ ప్రవేశాలు

పార్ట్ టైం ప్రోగ్రామ్లకు దరఖాస్తు చేసుకునేందుకు పీజీ అభ్యర్ధులకు కనీసం మూడేళ్ళ అనుభవం, డిగ్రీ అభ్యర్ధులకు కనీసం ఆరేళ్ల రిసెర్చ్ అనుభవం ఉండాలి.

IIITDM Kurnool : ఐఐఐటీడీఎం కర్నూల్ లో పీహెచ్ డీ ప్రవేశాలు

Iiitdm Phd

IIITDM Kurnool : కర్నూలులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్(ఐఐఐటీడీఎంకే)లో పీహెచ్ డీ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఫుల్ టైం, పార్ట్ టైం విధానంలో పీహెచ్ డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మేథమెటిక్స్ , ఇంగ్లీష్ తదితర విభాగాల్లో ఈ పీహెచ్ డీ ప్రొగ్రామ్ లు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇంజనీరింగ్ విభాగాలకు నిర్ధేశించిన కోర్సులో ప్రధమ శ్రేణి మార్కులతో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఐఐటీ సంస్ధల నుండి కనీసం 8సీజీపీఏతో, ఆర్ అండ్ డీ సంస్ధల నుండి కనీసం 60శాతం మార్కులలతో బీఈ, బీటెక్, పూర్తి చేసిన వారు సైతం అర్హులే. గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. మేధమెటిక్స్ కు ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు, గేట్, సీఎస్ఐఆర్ నెట్, ఎన్ బీహెచ్ ఎం, ఇన్స్పయిర్ ఫెలో షిప్ అర్హత ఉండాలి. ఇంగ్లీష్ విభాగానికి ఎంఏ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో నెట్, గేట్ ఉత్తీర్ణత తప్పనిసరి.

పార్ట్ టైం ప్రోగ్రామ్లకు దరఖాస్తు చేసుకునేందుకు పీజీ అభ్యర్ధులకు కనీసం మూడేళ్ళ అనుభవం, డిగ్రీ అభ్యర్ధులకు కనీసం ఆరేళ్ల రిసెర్చ్ అనుభవం ఉండాలి. ప్రభుత్వ ఆర్ అండ్ డీ సంస్ధలు, ప్రముఖ ఎడ్యుకేషనల్ సంస్ధలు పీఎస్ యూలలు, ప్రభుత్వ పరిశ్రమల్లో సీగ్రేడ్ సైంటిస్ట్ లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లు, లెక్చరర్ లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గాను ఫుల్ టైం అభ్యర్ధులకు మొదటి రెండేళ్లకు నెలకు 31,000, చివరి మూడేళ్ళకు నెలకు 35,000 అందజేస్తారు. అభ్యర్ధులు వారానికి ఎనిమిది గంటలపాటు ఆఫ్ టైం టీచింగ్, రీసెర్చ్ అసిస్టెంట్ షిప్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేది మే 20 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : IIItk.ac.in పరిశీలించగలరు.