Recruitment of Staff Nurse Posts : ఏపి వైద్య,ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు సంబంధిత ప్రాంతీయ డైరెక్టర్ మెడికల్ & హెల్త్ సర్వీసెస్‌కు అనుకూలంగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ మొదలైనవాటిని ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

Recruitment of Staff Nurse Posts : ఏపి వైద్య,ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ

Recruitment of Staff Nurse Posts

Recruitment of Staff Nurse Posts : ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య శాఖ స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 434 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జోన్ ల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే జోన్ I- 86, జోన్ II – 220, జోన్ III- 34, ZoneIV – 94 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Varanasi Cricket Stadium : కాశీ విశ్వేశ్వరుడి స్వరూపంలో వారణాశి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం .. ప్రత్యేకతలు ఇవే

దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ / B.Sc (నర్సింగ్) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి తత్సమానం అర్హత కలిగి ఉండాలి. కోవిడ్ స‌మ‌యంలో సేవ‌లందించిన‌వారు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ప‌నిచేసిన‌వారికి ఈ పోస్టుల భ‌ర్తీలో వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన స్టాఫ్ నర్స్ జీతం నెలకు రూ.30,500 చెల్లిస్తారు.

READ ALSO : TSPSC: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. టీఎస్‌పీ‌ఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు సంబంధిత ప్రాంతీయ డైరెక్టర్ మెడికల్ & హెల్త్ సర్వీసెస్‌కు అనుకూలంగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ మొదలైనవాటిని ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. జనరల్/EWS: INR 500/- , SC/ST/PWD/OBC: INR 300/- ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

READ ALSO : Cotton and Soya Crops : పత్తి,సోయాలో ఎరువుల యాజమాన్యంలో చేపట్టాల్సిన చర్యలు

దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 6, 2023 ఆఖరి గడువు తేదిగా నిర్ణయించారు. డిసెంబ‌ర్ 5 వ‌ర‌కు http://cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://cfw.ap.nic.in పరిశీలించగలరు.