Varanasi Cricket Stadium : కాశీ విశ్వేశ్వరుడి స్వరూపంలో వారణాశి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం .. ప్రత్యేకతలు ఇవే

అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువు కానున్నాడా.? కాశీ విశ్వనాధుడు క్రికెట్ స్టేడియంలో కొలువుకానున్నాడా..? శివయ్య ఢమరుకం, నెలవంక స్టేడియంలో కనువిందు చేయనున్నాయా..?

Varanasi Cricket Stadium : కాశీ విశ్వేశ్వరుడి స్వరూపంలో వారణాశి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం .. ప్రత్యేకతలు ఇవే

Varanasi international cricket stadium

International Cricket Stadium In Varanasi : ప్రముఖ పుణ్య క్షేత్రం కాశీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి (International Cricket Stadium In Varanasi)ప్రధాని మోదీ (PM Narendra Modi)శంకుస్థాపన చేయనున్నారు. ఈ స్టేడియం ప్రత్యేకతల్లో ఆధ్యాత్మికత ఉండేలా రూపొందించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ నిర్మాణానికి భూసేకరణ కోసం రూ.121 కోట్లు,బీసీసీఐ రూ.330 కోట్లు వెచ్చించనుంది. రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (Rudraksh International Convention)తర్వాత, వారణాసిలో నిర్మిస్తున్న ఈ స్టేడియంలో శివుని సంగ్రహావలోకనం, కాశీ యొక్క స్వరూపం కనిపించనుంది. అంటే అంతర్జాతీయ స్టేడియం కు ఆధ్యాత్మికత సొబగులు అద్దనున్నారు.

గంజారిలో 30 వేల సీట్ల సామర్థ్యంతో నిర్మాణం జరగనుంది. కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబించేలా స్టేడియం రూపుదిద్దుకోనుంది. శనివారం (సెప్టెంబర్ 23,2023)న ప్రధాని మోదీ ఈ స్టేడియంకు శంకుస్థాపన చేయనున్నారు.దీని కోసం ప్రధాని వారణాశి మధ్యాహ్నాం వరకు చేరుకుంటారని సమాచారం.

Diamond Ganesh : సహజ సిద్ధంగా ఏర్పడిన వజ్ర గణపతి .. ఏడాదికి ఒకసారే దర్శనం

ఈ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలు కూడా హాజరుకానున్నారు.బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్వి జై షా హాజరవుతారు. అలాగే సచిన్ టెండూల్కర్Sachin Tendulkar), సునీల్ గవాస్కర్(Sunil Gavaskar),రవిశాస్త్రి(Ravi Shastri),కపిల్ దేవ్ హాజరుకానున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నోలో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉండా యూపీలో ఇది మూడో స్టేడియం కానుంది. వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలోని గంజరి గ్రామంలోని రింగ్‌రోడ్డుకు సమీపంలో ఈ స్టేడియం 30 నెలల్లో సిద్ధం కానుంది.

స్టేడియం పైకప్పు నెలవంక ఆకారంలోను.. త్రిశూలం ఆకారంలో ఫ్లడ్‌లైట్లు, ఘాట్ స్టెప్స్ ఆధారిత సీటింగ్, ఎంట్రన్స్ లో బిల్వ పాత్ర ఆకారంలో మెటాలిక్ డిజైన్‌లు ఉంటాయి అని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ CEO (Uttar Pradesh Cricket Association) అంకిత్ ఛటర్జీ (Ankit Chatterjee)తెలిపారు.

క్రికెట్ స్టేడియం విశేషాలు
స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమి కోసం రూ. 121 కోట్లు..
నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చు..
స్టేడియం సీట్ల సామర్థ్యం 30 వేలు
అర్ధ చంద్రాకారంలో స్టేడియంపైకప్పు నిర్మాణం..
శివుడు ఆయుధం త్రిశూలం ఆకారంలో ఫ్లడ్‌లైట్ల నిర్మాణం..
బిల్వ పత్రాలను పోలి వుండేలా మరికొన్ని నమూనాలు..
నిర్మాణంలో కొలువు కానున్న పరమశివుడి డమరుకం..
కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబించనున్న క్రికెట్ స్టేడియం..
ఇన్ని ప్రత్యేకలున్న ఈ స్టేడియం డిసెంబరు 2025 నాటికి పూర్తవుతుందని అంచనా..