Appsc Ayush : ఏపీపీఎస్సీ ఆయుష్ లో 151 మెడికల్ ఆఫీసర్ల భర్తీ

ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయుర్వేద, హోమియోపతి, యునానిలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, ఏడాది ఇంటర్నషిప్ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్ కాబడి ఉండాలి.

Appsc Ayush : ఏపీపీఎస్సీ ఆయుష్ లో 151 మెడికల్ ఆఫీసర్ల భర్తీ

Appsc

Appsc Ayush :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 151 మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు కోరుతుంది. విభాగాల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే మెడికల్ ఆఫీసర్లు ఆయుర్వేదం మొత్తం ఖాళీలు 72 ( క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు13, తాజా ఖాళీలు 59) మెడికల్ ఆఫీసర్లు హోమియోపతి మొత్తం ఖాళీలు 53(క్యారీ ఫార్వర్డ్ 1, తాజా ఖాళీలు 52), మెడికల్ ఆఫీసర్లు యునాని మొత్తం ఖాళీలు 26 (క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు 21, తాజా ఖాళీలు 5 ఉన్నాయి.

ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయుర్వేద, హోమియోపతి, యునానిలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, ఏడాది ఇంటర్నషిప్ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్ కాబడి ఉండాలి. 2021 జులై 1 నాటికి 17 నుండి 42 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు 37,100 నుండి 91,450వరకు వేతనాన్ని చెల్లిస్తారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల అధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షను అబ్జెక్టివ్ టైప్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అక్టోబరు 4వతేది నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ధరఖాస్తుకు చివరితేది అక్టోబరు 25గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://psc.ap.gov.in/ను పరిశీలించగలరు.