JOBS : న్యూదిల్లీ స్పా లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఆర్కిటెక్చర్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి.

JOBS : న్యూదిల్లీ స్పా లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

Spa Jobs

JOBS : భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులుకోరుతున్నారు. బిల్డింగ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్ మెంట్, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, ట్రాన్స్ పోర్ట్ ప్లానింగ్, అర్బన్ డిజైన్, ఆర్కిటెక్చర్, ఫిజికల్ ప్లానింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఆర్కిటెక్చర్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది 14, జులై 2022గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; డైరెక్టర్ , స్పా, ఇంద్రప్రస్థ ఎస్టేట్, న్యూ దిల్లీ 110002,పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://spa.ac.in/ పరిశీలించగలరు.