NHM Outsourcing Jobs : తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఫీజు వివరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీడబ్ల్యూడీ, అభ్యర్థుకు రూ. 250 దరఖాస్తు రుసుం చెల్లించాలి.

NHM Outsourcing Jobs  : తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ

Beautiful Blooming Fresh Flower Isolated On Paper Background

NHM Outsourcing Jobs  : తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన అభ్యర్ధులను నియమించుకోనున్నారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 40, వేల రూపాయలు వేతనంగా అందించనున్నారు. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టుల అధారంగా విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధింత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఫీజు వివరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీడబ్ల్యూడీ, అభ్యర్థుకు రూ. 250 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు మే20,2022న జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా ; ది కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, టి.ఎస్, హైదరాబాద్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://chfw.telangana.gov.in/home.do పరిశీలించగలరు.