Kolkata IGM : కోల్ కతా ఐజీఎం లో పోస్టుల భర్తీ

ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7, 2022గా నిర్ణయించారు.

Kolkata IGM : కోల్ కతా ఐజీఎం లో పోస్టుల భర్తీ

Igm Kolksta

Kolkata IGM : సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ యూనిట్‌కు చెందిన కోల్‌కతాలోని ఇండియన్‌ గవర్నమెంట్‌ మింట్‌ (IGM)లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంగ్రేవర్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన, ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ఎంగ్రేవర్ పోస్టులు 3 ఖాళీలు , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 4 ఖాళీలు ఉన్నాయి.

ఎంగ్రేవర్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.23,910ల నుంచి రూ.85,570ల వరకు జీతంగా చెల్లిస్తారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కలిగి ఉండాలి. వేతనంగా నెలకు రూ.21,540ల నుంచి రూ.77,160ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://igmkolkata.spmcil.com/ పరిశీలించగలరు.