Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్తగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతుండగా తాజాగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు శాఖల్లో పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్తగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం

Telangana Cabinet

Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతుండగా తాజాగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం (డిసెంబర్ 10,2022) సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు శాఖల్లో పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలీస్ శాఖకు సంబంధించి వివిధ భాగాల్లో 3,966 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

ఆర్ అండ్ బీ శాఖలో 472 పోస్టుల భర్తీతోపాటు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఇంజినీర్ 3, సూపరింటెండెంట్ ఇంజినీర్ 12, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 13, డీఈఈ 102, అసిస్టెంట్ ఈఈ 163, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ 28, టెక్నికల్, నాన్ టెక్నికల్ 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు రూ. 1,865 కోట్లు కేటాయించింది.

Telangana Government Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 16వేల 940 ఉద్యోగాలు భర్తీ

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో 2,591 కొత్త ఉద్యోగ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 4 జూరియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో నూతన నియామకాలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల పని విధానంలో పలు సంస్కరణలు తీసుకురానుంది.