Telangana Government Jobs : నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు శాఖల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 2వేల 910 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో గ్రూప్ 2 ఉద్యోగాలు 663 ఉన్నాయి. గ్రూప్ 3 ఉద్యోగాలు 1373 ఉన్నాయి.

Telangana Government Jobs : నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు

Telangana Government Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు శాఖల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 2వేల 910 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో గ్రూప్ 2 ఉద్యోగాలు 663 ఉన్నాయి. గ్రూప్ 3 ఉద్యోగాలు 1373 ఉన్నాయి.

పశుసంవర్ధక, మత్స్యశాఖలో 294 ఖాళీలను భర్తీ చేయనుంది. గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధృవీకరణ సంస్థలో 25 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదివరకు గ్రూప్ 1, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో 2వేల 910 ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపడంతో నిరుద్యోగులకు మంచి అవకాశం దక్కినట్లు అయ్యింది.

ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విషెష్ తెలిపారు.

 

గడిచిన మూడు నెలల నుంచి మొత్తం 52వేల 460 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. మిగిలిన పోస్టులకు కూడా త్వరలో ఆర్థిక శాఖ నుంచి అనుమతి రానుందని మంత్రి హరీశ్ చెప్పారు.

* అగ్రికల్చర్ విభాగంలో 347 పోస్టులు
* వెటర్నరీ అండ్ యానిమల్ హజ్బండరీ విభాగంలో 294
* కోఆపరేటివ్ సొసైటీ లో 99
* వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో 50
* విత్తనోత్పత్తి సంస్థలో 25
* హార్టికల్చర్ విభాగంలో 21
* మత్స్యశాఖలో 15
* అగ్రికల్చర్ మార్కెటింగ్ విభాగంలో 12
* ఎలక్ట్రికల్ విభాగంలో 11
* గ్రూప్ 3 కింద.. 1373
* గ్రూప్ 2 కింద 663 పోస్టులు మంజూరు.

త్వరలో 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగులంతా మళ్లీ పుస్తకాలు పట్టుకుని ప్రిపరేషన్ లో మునిగిపోయారు. ఇప్పటివరకు 52వేల 460 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది.

తాజాగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడంతో.. నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటికి త్వరలోనే నోటిఫికేషన్లను వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ కసరత్తు మొదలు పెట్టింది. ఇక ఇతర ఉద్యోగాలతో పోల్చితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు అత్యధిక పోటీ ఉంటుంది. వందల సంఖ్యలో ఉన్న ఖాళీలకు లక్షల్లో అభ్యర్థులు పోటీ పడతారు.