UGC Scholarships : డ్రిగ్రీ, పీజీ విద్యార్దులకు స్కాలర్ షిప్ లను అందించనున్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, దరఖాస్తులు ప్రారంభం

యూజీసీ పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్ కు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో రెగ్యులర్, ఫుల్​ టైమ్ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. దూరవిద్య విధానంలో పీజీ కోర్సుల్లో చేరే వారికి ఈ స్కాలర్​షిప్​ వర్తించదు. కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉన్న వారికే ఈ స్కాలర్​షిప్​ వర్తిస్తుంది.

UGC Scholarships : డ్రిగ్రీ, పీజీ విద్యార్దులకు స్కాలర్ షిప్ లను అందించనున్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, దరఖాస్తులు ప్రారంభం

UGC Scholarships

UGC Scholarships : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్కాలర్‌షిప్ పథకాలకు దరఖాస్తులు కోరుతుంది. మొత్తం నాలుగు రకాల స్కాలర్ షిప్ లను అందజేస్తుంది. వీటిలో ఈశాన్య ప్రాంతానికి యూజీసీ ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్, యూజీసీ పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్, యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్‌లకు పీజీ స్కాలర్‌షిప్, ఎస్.సీ, ఎస్.టీ విద్యార్థులకు పీజీ స్కాలర్‌షిప్ లు అందిస్తుంది.

యూజీసీ పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్ కు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో రెగ్యులర్, ఫుల్​ టైమ్ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. దూరవిద్య విధానంలో పీజీ కోర్సుల్లో చేరే వారికి ఈ స్కాలర్​షిప్​ వర్తించదు. కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉన్న వారికే ఈ స్కాలర్​షిప్​ వర్తిస్తుంది. ఏడాది మొత్తం 1,200 స్కాలర్​ షిప్​లను అందజేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించరాదు.

యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్లకు యూజీసీ పీజీ స్కాలర్‌షిప్ లను అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన వారికి ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, అటానమస్ కాలేజీలో రెగ్యులర్, ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందిన మొదటి, రెండవ ర్యాంక్ హోల్డర్లు మాత్రమే ఈ స్కాలర్‌షిప్​కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏటా సాధారణ కోర్సులు చేసే 1,800 మంది, ఆనర్స్ కోర్సులు చేసే 575 మందికి స్కాలర్​షిప్​ అందజేస్తారు. స్కాలర్‌షిప్ కింద రెండేళ్లపాటు నెలకు రూ. 3,100 అందజేస్తారు. అభ్యర్థుల వయస్సు అడ్మిషన్ సమయంలో 30 సంవత్సరాలలోపు ఉండాలి.

యూజీసీ ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్ గాను భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం విద్యార్థులను ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు యూజీసీ ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది. మొదటి సంవత్సరంలో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మాత్రమే స్కాలర్‌షిప్​కు అర్హులు. మెడికల్, పారామెడికల్ కోర్సులతో సహా సాధారణ డిగ్రీ కోర్సులు చేసే విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 10,000 మంది విద్యార్థులకు స్కాలర్​షిప్​ అందజేస్తారు. సాధారణ డిగ్రీ చేసే వారికి నెలకు రూ. 5,400, టెక్నికల్, మెడికల్, ప్రొఫెషనల్, పారామెడికల్ కోర్సులు చేసే వారికి నెలకు రూ.7,800 స్కాలర్​షిప్​ అందజేస్తారు.

ఎస్.సి, ఎస్.టి విద్యార్థులకు యూజీసీ పీజీ స్కాలర్‌షిప్ క్రింద ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ వైపు ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్​షిప్​ స్కీమ్​ను ప్రవేశపెట్టారు. దీని కింద ఏటా 1,000 మందికి స్కాలర్​షిప్​ అందజేస్తారు. ఎంఈ, ఎంటెక్ కోర్సులకు నెలకు రూ.7,800, ఇతర కోర్సులకు నెలకు రూ.4,500 స్కాలర్​షిప్​ మంజూరు చేస్తారు.

దరఖాస్తు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత గల అభ్యర్థులు Scholarships.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 31, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ner.ugc.ac.in/ పరిశీలించగలరు.