Jobs : సికింద్రాబాద్ నైపెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టులను అనుసరించి నెలకు 15వేల నుండి 40 వేల వరకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆప్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

Jobs : సికింద్రాబాద్ నైపెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Niepid (1)

Jobs : భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెక్చువల్ డిజెబిలిటీస్ (దివ్యాంగ్ జన్) లో పోస్టుల భర్తీ చేపటనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో క్లినికల్ సైకాలజిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, ఎర్లీ ఇంటర్ వెన్షనిస్ట్, ఫిజియో థెరపిస్ట్, నర్సు, ట్రెయిన్డ్ కేర్ గివర్లు, యాక్టివిటీ టీచర్ వంటి పోస్టులు ఉన్నాయి.

పోస్టులను అనుసరించి నెలకు 15వేల నుండి 40 వేల వరకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆప్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; నైపెడ్, మనో వికాస్ నగర్, సికింద్రాబాద్, తెలంగాణా 500009, దరఖాస్తులు పంపేందుకు జులై 20, 2022ను ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.niepid.nic.in/ పరిశీలించగలరు.