Sbi Recruitment :స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

Sbi Recruitment :స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీ

Check SBI Vacancy

Sbi Recruitment : ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 439 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ , డిప్యూటీ మేనేజర్ , చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ , మేనేజర్ , సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

READ ALSO :Paddy Cultivation : ముదురు వరి నారు వేసేటప్పుడు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు వర్తిస్తుంది.

READ ALSO : Dragon Fruit : అమెరికన్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ సాగు

సరైన అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 6, 2023గా నిర్ణయించారు. ఆన్‌లైన్ పరీక్ష తేదీ డిసెంబర్‌ 2023/ జనవరి 2024 లలో జరుగుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/ పరిశీలించగలరు.