Karnataka Polls: ఒక్క హామీతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్.. రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ మందిరాలు నిర్మిస్తామంటూ హామీ

"మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్‌ను కర్ణాటక ప్రభుత్వం నిషేధించదు" అని మొయిలీ అన్నారు.

Karnataka Polls: ఒక్క హామీతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్.. రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ మందిరాలు నిర్మిస్తామంటూ హామీ

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జోరు మీదున్న కాంగ్రెస్.. ఒకే ఒక్క హామీతో పూర్తిగా ఇరుకున పడిపోయింది. వాస్తవానికి ఒపీనియన్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. కొన్ని అయితే ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వస్తుందని కూడా ప్రకటించాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీకొట్టాలో తెలియని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ అధికారంలోకి రాగానే బజరంగ్ దళ్ సంస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒకే ఒక్క హామీ, ఆ పార్టీ మొత్తం గ్రాఫ్ ను పడేస్తున్నట్లే కనిపిస్తోంది.

Bajrang Dal: ‘బజరంగ్ భలి’ అని ఓట్లేయమంటూ ఓటర్లను కోరిన మోదీకి అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చిన శివసేన

ఇక దీనికి తోడు తాజాగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చేసిన తాజా ప్రకటన అయితే బజరంగ్ దళ్ మీద కాంగ్రెస్ పార్టీ పూర్తి యూటర్న్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో డీకే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ మందిరాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’’ అని డీకే అన్నారు.

Maharashtra Politics: శరద్ పవార్ రాజీనామాకు గల కారణాలు ఇవేనంటూ వెల్లడించిన సామ్నా

దీనికి ముందు తమ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పేరును రాడికల్ సంస్థగా పేర్కొన్నామే కానీ, రద్దు చేస్తామని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ వివరణ ఇచ్చారు. “మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్‌ను కర్ణాటక ప్రభుత్వం నిషేధించదు” అని మొయిలీ అన్నారు.