Maharashtra Politics: శరద్ పవార్ రాజీనామాకు గల కారణాలు ఇవేనంటూ వెల్లడించిన సామ్నా

తన రెండవ పుస్తకం ప్రారంభం రోజే రాజీనామాను ప్రకటించారు పవార్. అయితే అక్కడికి పార్టీ అధ్యక్ష హోదాలో తన చిట్టచివరి ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని వచ్చారని సామ్నా తెలిపింది. అయినప్పటికీ ఇది అసాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది.

Maharashtra Politics: శరద్ పవార్ రాజీనామాకు గల కారణాలు ఇవేనంటూ వెల్లడించిన సామ్నా

Maharashtra Politics: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన అనంతరం, ఆయన ఎందుకు రాజీనామా చేశారనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి ఆయన కానీ, పార్టీ వర్గాలు కానీ ఇప్పటి వరకు ఒక స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. అయితే పవార్ రాజీనామాకు గల కారణాలను శివసేన (యూబీటీ) పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో కొన్ని విశ్లేషణలు చేశారు. బాగా ఆలోచించిన తర్వాతే పవార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో రాసుకొచ్చారు.

Himachal Pradesh: బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్.. 24 స్థానాల్లో విజయకేతనం

తన రెండవ పుస్తకం ప్రారంభం రోజే రాజీనామాను ప్రకటించారు పవార్. అయితే అక్కడికి పార్టీ అధ్యక్ష హోదాలో తన చిట్టచివరి ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని వచ్చారని సామ్నా తెలిపింది. అయినప్పటికీ ఇది అసాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది. తాను ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు కలవరపడ్డారని, అయితే అప్పటికే వారిలో చాలా మంది ఒక కాలును బీజేపీ పడవలో పెట్టి ఉంచారని తెలిపింది. పార్టీ ముక్కలయ్యే సమయంలో గౌరవప్రదంగా తప్పుకోవాలని పవార్ నిర్ణయించుకుని ఉండవచ్చునని సామ్నా అంచనా వేసింది. ‘మీరే పార్టీ’ అని జయంత్ పాటిల్ జయంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను సరైనవేనని సామ్నా వ్యాఖ్యానించింది. ఎన్సీపీ శరద్ పవార్ పేరు మీదే నిలబడిందని అభిప్రాయపడింది.

Bajrang Dal: ‘బజరంగ్ భలి’ అని ఓట్లేయమంటూ ఓటర్లను కోరిన మోదీకి అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చిన శివసేన

ఎన్సీపీ భవిష్యత్తు గురించి కూడా ఈ సంపాదకీయం ప్రస్తావించింది. ఎంపీగా సుప్రియ సూలే బాగా పని చేశారని ప్రశంసించింది. ఆమెకు న్యూఢిల్లీలో కూడా మంచి పట్టు ఉందని తెలిపింది. కానీ అజిత్ పవార్ ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని వ్యాఖ్యానించింది. రాజకీయాలు, సామాజిక సేవలో శరద్ పవార్ కృషి చాలా ఉందని చెప్తూనే ఆయన నిర్ణయం ఓ మాస్టర్‌స్ట్రోక్ అని ప్రస్తావించింది. పార్టీలో జరుగుతున్నదానిని ఆయన బయటపెట్టారని తెలిపింది. ఇప్పటి వరకు జరిగినదానిలో పవార్ హీరో అని పేర్కొంది. భారత దేశ రాజకీయాల్లో భీష్మునిగా శరద్ పవార్‌ను అభివర్ణించింది. భీష్ముడిలా పడిపోకుండా తాను సారథ్యంవహిస్తానని ఆయన చూపించారని తెలిపింది.