Karnataka: అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.. కానీ అదే ఇప్పుడు తలనొప్పిగా మారింది?

వాస్తవానికి ఈ ఆధిపత్య పోరు బయటికి పెద్దగా కనిపించకపోయినా.. అంతర్గతంగా బాగానే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Karnataka: అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.. కానీ అదే ఇప్పుడు తలనొప్పిగా మారింది?

DK vs Siddu: ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సరిగ్గా చెప్పాలంటే సర్వేల అంచనాలను సైతం దాడి కాంగ్రెస్ విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా ఓటములతో కుంగిపోతున్న కాంగ్రెస్ నేతలకు, కర్ణాటక విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ, కర్ణాటకలో గెలుపు అనంతరం కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చింది. పైగా ఇది ఆ పార్టీ గెలుపుతోనే రావడం గమనార్హం.

Siddaramaiah : వరుణ నుంచి సిద్ద రామయ్య విజయం..మరోసారి సీఎం అవుతారా?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు అగ్ర నేతలు ఉన్నారు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాగా, మరొకరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్. అయితే వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరైతే ఉంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పోరు కూడా ప్రారంభం అవుతుందనే గుసగుసలు కూడా ఉన్నాయి. ఆ గుసగుసలు ఇప్పుడు నిజమైనట్టే కనిపిస్తున్నాయి. ఇద్దరు నాయకుల మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం అప్పుడే కోల్డ్ వార్ మొదలైనట్లు కనిపిస్తోంది.

DK Shivakumar Emotion : కన్నడ ప్రజలకు సాష్టాంగ నమస్కారం.. ఇది కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితం : డీకే శివకుమార్ భావోద్వేగం

ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడనే లేదు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీపై కర్చీఫ్ వేశారు. తన తండ్రినే ముఖ్యమంత్రి చేయాలని మీడియా ద్వారా ప్రకటన ఇచ్చేశారు. ఇటు డీకే శివకుమార్ మద్దతుదారులు సైతం.. డీకేకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఆధిపత్య పోరు బయటికి పెద్దగా కనిపించకపోయినా.. అంతర్గతంగా బాగానే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress: కర్ణాటక గాలి తెలంగాణకు వీచేనా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందా?

పూర్తి ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అయితే దీనికి ముందే ఇరు పార్టీల మద్దతుదారులు ముఖ్యమంత్రి పదవిపై వాదులాడుతుండడం గమనార్హం. ఈ పోరు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున కుమారుడు ప్రియాంక్ ఖర్గే అన్నారు. సీఎం పదవిపై ఎవరి ఊహాగాణాలు వారికే ఉన్నాయి. అయితే ఎవరిని పదవి వరిస్తుందో, అసంతృప్తుల్ని కాంగ్రెస్ ఎలా చల్లబరుస్తుందో చూడాలి.