DK Shivakumar Emotion : కన్నడ ప్రజలకు సాష్టాంగ నమస్కారం.. ఇది కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితం : డీకే శివకుమార్ భావోద్వేగం

కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుంధుబితో కాంగ్రెస్ నేతలు భావోద్వేగానికి గురి అవుతున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కంటతడితో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే కన్నడ ప్రజలకు నా సాష్టాంగ నమస్కారం అంటూ భావోద్వేగానికి గురి అయ్యారు.

DK Shivakumar Emotion : కన్నడ ప్రజలకు సాష్టాంగ నమస్కారం.. ఇది కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితం : డీకే శివకుమార్ భావోద్వేగం

DK Shivakumar emotion on Karnataka Assembly Election Result

Karnataka Election Result 2023: ర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారు అయినట్లే ఉంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ నేతలు విజయం సాధిస్తున్నారు. ఇంతటి విజయం ఇస్తున్నందుకు కన్నడ ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటూ భావోద్వేగానికి గురి అయ్యారు. ఇప్పటికే కనకపుర నుంచి విజయం సాధించిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. అవినీతికి పాల్పడకుండా కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అంటూ భావోద్వేగానికి గురి అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషికి, కష్టానికి ప్రతిఫలితం ఈ ఫలితం అని అన్నారు. అన్ని ఒత్తిడులను ఎదుర్కొని కాంగ్రెస్ కార్యకర్తలు విజయం సాధించారని అన్నారు. గాంధీ కుటుంబంపై కన్నడ ప్రజలు నమ్మకముంచారని ఈ విజయం రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అంకితం అని తెలిపారు. అలాగే మాజీ సీఎం సిద్దరామయ్య కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.వరుణ నుంచి సిద్ధరామయ్య బీజేపీ అభ్యర్థి సోమన్ పై విజయం సాధించారు.

DK Shivakumar : కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం .. ఎనిమిదోసారి సత్తా చాటిన వొక్కలిగ వారసుడు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ (congress party) దూకుడు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 224 స్థానాలకుగాను ప్రభుత్వం ఏర్పాటుకు 113 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ 120పైగా స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. కర్ణాటకలో భారీ విజయంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

ఇక ఓటు శాతంలోనూ కాంగ్రెస్ ఊహించని స్థాయిలో విజయం సాధించేట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 43 శాతం ఓట్లు కాంగ్రెస్ వెనకేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ విజయం సాధించడానికి గల కారణాల ఏమిటి? అనేది ప్రధాన చర్చగా మారింది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధాన సమస్య పార్టీ నేతల్లో ఐకమత్యం లేకపోవడం. ఈ కారణం చేతనే పార్టీ అనేక ఎన్నికల్లో ఓటమిని చవి చూస్తూ వస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు చాలా ఎక్కువ. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండే పరిస్థితులు కాంగ్రెస్ నేతల మధ్య కనిపించవు. వారి పట్టింపుల ముందు పార్టీ కూడా చిన్నదైపోతుంది. కానీ కర్ణాకట కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ పార్టీ పరంగా వారి ఐక్యత కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. అంతే కాకుండా ఎన్నికల్లో వారి నాయకద్వయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును ఇచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు ఇది ప్రధాన కారణంగా నిలిచిందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.