DK Shivakumar : కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం .. ఎనిమిదోసారి సత్తా చాటిన వొక్కలిగ వారసుడు

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిక్యంత కొనసాగుతోంది. దీంట్లో భాగంగా కనకపుర స్థానం నుంచి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం సాధించారు.

DK Shivakumar : కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం .. ఎనిమిదోసారి సత్తా చాటిన వొక్కలిగ వారసుడు

PCC chief DK Shivakumar won

Karnataka Election Result 2023 : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిక్యంత కొనసాగుతోంది. దీంట్లో భాగంగా కనకపుర స్థానం నుంచి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం సాధించారు. 40వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు శివకుమార్. బీజేపీ అభ్యర్థి అశోకపై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం సాధించారు. అలాగే హిరియూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ కూడా గెలుపొందారు. మొలకల్మూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గోపాలకృష్ణ విజయం సాధించారు.

శివకుమార్ రాజకీయ ప్రస్థానం..
డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ మాజీ సీఎంలు సిద్ధరామయ్య, సంకీర్ణ ప్రభుత్వంలో జేడీఎస్ నాయకత్వంలో కుమారస్వామి మంత్రి వర్గంలోను మంత్రిగా పనిచేశారు. కుమారస్వామి మంత్రివర్గంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగాను..సిద్ధరామయ్య ప్రభుత్వంలో కర్ణాటక ప్రభుత్వంలో ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు.

1980లో విద్యార్ధి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శివకుమార్ అంచెలంచెలుగా ఎదిగారు. మంత్రిగా పనిచేశారు. సీఎం రేసులో ఉన్నారు. 1989లో మైసూరు జిల్లాలోని సాథనూర్ నియోజకవర్గం నుండి తన 27 ఏళ్ల వయస్సులో శివకుమార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే కనకపుర నియోజక వర్గం నుంచి శివకుమార్ 1994,1999,2004,2008లో కూడా విజయం సాధించారు. అదే హవాను కొనసాగిస్తు 2023లో కూడా మరోసారి విజయం సాధించారు. కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హిస్టరీ శివకుమార్ ది. ఈక్రమంలో మరోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఒక్కలింగాల ఓట్లు చీల్చాలని బీజేపీ ప్లాన్ ను తల్లకిందులకు చేసి విజయం సాధించారు డీకేశి.

మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి స్వల్ప ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓటమి దిశగా ఉన్నారు. కేవలం 554 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. కుమారస్వామికి బీజేపీ అభ్యర్థి యోగేశ్వర గట్టి పోటీఇస్తున్నారు. మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ కు షాకిస్తున్న ఓటర్లు. 23వేల ఓట్ల వెనుకంజలో షెట్టారు. టికెట్ రాకపోవటంతో చివరి నిమిషంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగదీశ్ షెట్టార్ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయారు.

సీఎం బసవరాజ్ బొమ్మై విజయం ..
కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై విజయం సాధించారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
జేడీఎస్ ఆశలు గల్లంతు..
కర్ణాటకలో హంగ్ వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటులో చక్రం తిప్పేది మేమేనని భావించిన జేడీఎస్‌కు కన్నడ ఓటర్లు షాకిచ్చారు. తాజా ఫలితాల్లో.. పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. దీనికితోడు గత 2018 ఎన్నికల కంటే ఈ దఫా జేడీఎస్ పార్టీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తుంది. 2018లో 37 స్థానాల్లో జేడీఎస్ విజయం సాధించి. ప్రస్తుతం జేడీఎస్ 23 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది.

120 స్థానాల్లో గెలుస్తాం సిద్ధ రామయ్య..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 120 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు.