గుడ్ న్యూస్ : 69 శాతం కోవిడ్ బాధితుల్లో వైరస్ లేదు

ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. ఎన్నో దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. భారతదేశంలో కూడా వైరస్  వ్యాపిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది.

గుడ్ న్యూస్ : 69 శాతం కోవిడ్ బాధితుల్లో వైరస్ లేదు

ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. ఎన్నో దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. భారతదేశంలో కూడా వైరస్
వ్యాపిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. కఠినంగా ఆంక్షలు విధిస్తోంది. కానీ..కరోనా వైరస్ పై రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వైరస్ సాధారణంగా పోదని, కొన్ని రోజుల పాటు శరీరంలోనే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వీరికి తప్పకుండా చికిత్స చేయించాల్సిందేనంటున్నారు. కానీ దీనిపై ICMR తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలపై చేసిన అధ్యయన వివరాలను సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గా గంగా కేడ్కర్ వెల్లడించారు. 69 శాతం కోవిడ్ – 19 బాధితుల్లో వైరస్ లక్షణాలు లేవని, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో కరోనా లక్షణాలు కనిపించడం లేదని వెల్లడించారు. 90 శాతం మంది సాధారణ వైద్యంతోనే కోలుకుంటున్నారని, ఒక్క శాతం రోగులకు మాత్రమే వెంటిలెటర్ ద్వారా చికిత్స అందించాల్సి వస్తుందని ICMR వెల్లడించింది.

భారతదేశంలో 2020, ఏప్రిల్ 22వ తేదీ బుధవారం నిర్వహించిన పరీక్షల్లో 19 వేల 484 మందికి పైగా…కోవిడ్ 19 వైరస్
లేదని, వైరస్ బారిన పడిన వారిలో 3 వేల 870 మంది కోలుకున్నారని..640 మంది చనిపోయారని వెల్లడించింది. లక్షణాలు కనిపించని వారి నుంచి ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, అయితే ఇది ఎంత శాతం ఉందో తేలాల్సి ఉంది. 14 రోజులలోపు కరోనా లక్షణాలు బయటపడుతాయి.

ఒకవేళ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో 4 లేదా 5 రోజుల్లోనే వైరస్ బయటపడుతుంది. వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు, వ్యాధి నిరోధక శక్తి…తక్కువగా ఉన్న వారు మాత్రమే మరణిస్తున్నారు. చైనాలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత… పరీక్షల్లో 78 శాతం మందికి కోవిడ్ వైరస్ సోకినట్లు తేలినా కరోనా లక్షణాలు కనిపించలేదని ICMR వెల్లడించింది.