మీ జుట్టు రాలిపోతుందా? టెన్షన్ పడకండి. 5 షాకింగ్ రీజన్స్ లో ఒత్తిడికూడా ఒకటి.

  • Published By: sreehari ,Published On : February 8, 2020 / 06:44 AM IST
మీ జుట్టు రాలిపోతుందా? టెన్షన్ పడకండి. 5 షాకింగ్ రీజన్స్ లో ఒత్తిడికూడా ఒకటి.

మీ జట్టు రాలిపోతుందా? తలపై జుట్టుంతా పలచబడిందా? బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త. సాధారణంగా జట్టు ఊడిపోవడం అనేది సహజంగా అందరిలోనూ ఉంటుంది. కొన్నాళ్లు జుట్టు నిద్రావస్థలోకి వెళ్లడం.. జుట్టు ఊడిపోవడం.. ఆ స్థానంలో తిరిగి కొత్త జుట్టు పెరగడం కామన్ గా జరిగేది. ఇందులో భయపడాల్సిన పనిలేదు. కానీ, జుట్టుకు అతిగా ఊడిపోతుంటే మాత్రం ఆందోళన పడే విషయమే. ఎందుకుంటే.. జుట్టు కుదుళ్లలో ఎన్నో మార్పులు సంభవిస్తుంటాయి.

ప్రతిఒక్కరిలో నేచురల్ సైకిల్ అనేది ఐదేళ్ల నుంచి ఆరేళ్లలో ముగుస్తుంటుంది. కొంతమందిలో అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. ఒక రోజులో 100 వరకు వెంట్రుకలు ఊడిపోవడం అనేది కచ్చితంగా నార్మల్‌గా ఉన్నట్టే.  వయస్సు బట్టి కూడా హెయిర్ ఊడిపోవడం జరుగుతుంటుందని ఫార్మా మెడికో, మెడికల్ డైరెక్టర్ హెయిర్ లాస్ ఎక్స్‌పర్ట్.. ఒమర్ మిల్హెమ్ అన్నారు. 

జుట్టు ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయని అంటున్నారు. ఒత్తిడి ప్రధాన కారణమని, దీనికి తోడు ఏమైనా దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్, గుండెసంబంధిత వ్యాధులు ఉన్నా కూడా జుట్టు విపరీతంగా ఊడిపోయే అవకాశం ఉంది. మీ జుట్టు ఏ కారణంగా ఊడుతుందో వైద్యులు పరీక్షించి నిర్ధారించాలి. ఆరోగ్యం మెరుగుపడినప్పుడే జుట్టు పెరుగుదల కూడా తిరిగి మెరుగుపడుతుంది.

ముగ్గురు మహిళల్లో ఒకరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్టు ట్రికాలిజిస్ట్ శారా జి. అల్లిసన్ తెలిపారు. మహిళల్లో జుట్టు ఊడిపోవడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసాన్ని మరింత కృంగదీస్తుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. జుట్టు ఊడిపోవడానికి గల ఐదు షాకింగ్ రీజన్స్ ఏంటో తెలుసుకుంటే ఈజీగా నివారించుకోవచ్చు. 

1. హెయిర్ స్టయిల్ మార్చకపోవడం  : 
హెయిర్ స్టయిల్ అనేది.. ప్రస్తుత రోజుల్లో ప్రొఫెషన్ గా మారింది. ఒకవేళ మీరు కూడా ఒకే రీతిలో హెయిర్ స్టయిల్ ఉంటే జుట్టు పరంగా  పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్దిష్టమైన హెయిర్ స్టయిల్ ఉన్నవారిలో ట్రాక్షన్ అలోపేసియాకు కారణమవుతుంది. దీనివల్ల బట్టతల మచ్చలు, జుట్టు బాగా పలచబడిపోవడం.. చివరికి పూర్తిగా ఊడిపోయే ప్రమాదం ఉంది. 

2. మందులతో సైడ్ ఎఫెక్ట్స్ :
హర్మోన్ల లోపంతో కూడా జుట్టు ఊడిపోతుంది. కొన్ని సందర్భాల్లో మందుల ప్రభావంతో కూడా జట్టు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊడిపోతుంటుంది. ఇతర డ్రగ్స్ ఏదైనా వాడినా కూడా ఆ ప్రభావం మీ జుట్టుపై పడుతుంది. యాంటిడిప్రజెంట్స్ డ్రగ్స్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి జుట్టంతా ఊడిపోవడం మొదలవుతుంది. 

3. ఆహారంలో లోపాలు :
ఆహారపు అలవాట్లలో చేసే చిన్న తప్పుల వల్ల జుట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. సడన్ డైట్ చేయడం.. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం.. లేదా కేవలం కూరగాయాలు మాత్రమే తినడం కారణంగా పోషకాహార లోపం తలెత్తి జుట్టుకు కావాల్సిన జింక్, ఐరన్ కొరత వల్ల కూడా ఊడిపోతాయి. జింక్, బయోటిన్ సప్లిమెంట్స్ మూడు నెలల వరకు తీసుకోవడం ద్వారా ఈ జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. 

4. ఒత్తిడి సమస్య :
టెలోజెన్ ఎఫ్లూవియం.. సమస్య ఒత్తిడి కారణంగా వస్తుంది. జుట్టు కుదుళ్ల దగ్గర పెరుగుదల ఆగిపోతుంది. ఇది ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో కనిపిస్తుంది. దీర్ఘకాలం లేదా తక్కువ కాలం ఉండొచ్చు. థైరాయిడ్, ఇతర మందుల సమస్యలతో కూడా ఈ సమస్య రావొచ్చు. యోగా, ధ్యానంతో పాటు థెరపీలు, వ్యాయామాలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 

5. మోనోపాజ్.. ప్రెగ్నెన్సీ : 
ఆండ్రో జెనిటిక్ అలోపేసియా.. హార్మోన్ల లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుంది. మోనాపాజ్ సమయంలో మహిళల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. మోనోపాజ్ తర్వాత జుట్టు పెరగడానికి చాలామందికి మినోక్సిడిల్ సూచిస్తుంటారు. గర్భం దాల్చిన సమయంలో కూడా మహిళల్లోనూ జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. ప్రసవం అనంతరం మళ్లీ వారిలో జుట్టు తిరిగి పెరుగుతుంది.