Weight Loss : బరువు తగ్గడానికి 5 సూపర్ ఇండియన్ ఫుడ్ కాంబోస్ !

వెజిటబుల్ పులావ్, రైతా విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బియ్యం కార్బోహైడ్రేట్లను అందిస్తుంది, రైటా తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలను శరీరానికి అందిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి ఈ రెండింటి కలయిక ద్వారా అందుతుంది.

Weight Loss : బరువు తగ్గడానికి 5 సూపర్ ఇండియన్ ఫుడ్ కాంబోస్ !

Food Combos For Weight Loss

Weight Loss : బరువు తగ్గడం విషయానికి వస్తే మీరు ఎంత తింటున్నారు, ఏమి తింటున్నారు అనేదానిపైనే అధారపడి ఉంటుంది. భారతీయ వంటకాలు రుచి, సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారికి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలని చూస్తున్న వారికి ఈ ఆహారాలు మంచి ఎంపికగా చెప్పవచ్చు.

READ ALSO : Lose Weight : బరువు తగ్గడానికి కాఫీ ఎలా తాగాలి? బ్లాక్ కాఫీ మంచిదా.. మిల్క్ కాఫీ మంచిదా?

బరువు తగ్గడానికి దోహదపడే ఐదు ఆహార కాంబినేషన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. పప్పుతో కలిపి కూరగాయలతో తయారైన రైతా ; తక్కువ క్యాలరీలు కలిగిన వెజిటబుల్ రైతాతో ప్రోటీన్ అధికంగా ఉండే పప్పు కలపడం వల్ల తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే పోషకమైన ఆహారంగా మారుతుంది. ఈ ఆహారం మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాల ను పొందటానికి గొప్ప మార్గంగా చెప్పవచ్చు. పప్పులోని ప్రోటీన్ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది, అయితే కూరగాయలతో తయారైన రైతా జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడే ఫైబర్ ను ఆరోగ్యకరమైన మోతాదులో అందిస్తుంది.

2. కొబ్బరి చట్నీతో పరాటా ; కొబ్బరి చట్నీ ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌తో నిండి ఉంటుంది. గోధుమ పిండితో తయారైన పరాటాను కొబ్బరి చట్నీతో కలిపి తీసుకున్నప్పుడు ఆహారం పోషకమైనది అవుతుంది. కొబ్బరి చట్నీలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ , ఫైబర్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి. పరాటాలో కార్బోహైడ్రేట్‌లు , ప్రోటీన్‌లను కలిగి ఉంటుంది. సమతుల్య ఆహారంగా దీనిని చెప్పవచ్చు.

READ ALSO : Weight Loss : బరువు తగ్గే ప్రక్రియలో కేలరీలే ఎందుకు కీలకం !

3. ఆలూ గోబీతో చపాతీ ; ఆలూ గోబీ లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. చపాతీతో కలిపి తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. తక్కువ కేలరీలు , పోషకాలతో కూడిన సమతుల్య ఆహారంగా చెప్పవచ్చు. ఆలూ గోబీ అనేది కూరగాయలతో తయారవుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ కడుపునిండిన భావన ఎక్కువ సమయం ఆకలిలేకుండా చేస్తుంది.

4. వెజిటబుల్ పులావ్ ను రైతా కలిపి తీసుకుంటే ; వెజిటబుల్ పులావ్, రైతా విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బియ్యం కార్బోహైడ్రేట్లను అందిస్తుంది, రైటా తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలను శరీరానికి అందిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి ఈ రెండింటి కలయిక ద్వారా అందుతుంది. తక్కువ కేలరీలు మరియు తక్కువ కొవ్వు కంటెంట్ బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

READ ALSO : Losing Weight for Diabetics : డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు !

5. కూరగాయల ఉప్మాతో కలిపి పెరుగు ; ఉప్మా ను కూరగాయలతో కలిపి చేస్తే రుచికరమైనదే కాకుండా పోషక విలువలు కలిగినదిగా మారుతుంది. దానికి పెరుగును జోడిస్తే రుచితోపాటు బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారంగా మారుతుంది. తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వుతో కూడిన పోషకమైన ఆహారంగా దీనిని చెప్పవచ్చు. అల్పాహారంగా దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీని తయారీ తక్కువ సమయంలో పూర్తవుతుంది.

ఈ ఐదు భారతీయ ఆహారలు రుచితోపాటు ఫైబర్, విటమిన్‌లతో నిండి ఉంటాయి. కేలరీలు , కొవ్వులు వీటిలో తక్కువగా ఉంటాయి, కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఆరోగ్యకరమైన మార్గంలో బరువును కోల్పోతారు. వీటితోపాటు వ్యాయామం, మంచి నిద్ర కూడా అవసరమౌతుంది.