Losing Weight for Diabetics : డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు !

టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో 60%, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో 85% మంది అదనపు బరువు, ఊబకాయంతో జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి మధుమేహ రోగులకు బరువు తగ్గడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదనపు బరువు తగ్గడం వల్ల మధుమేహ వ్యాధిని నిర్వహించడం సులభతరమౌతుంది.

Losing Weight for Diabetics : డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు !

Losing Weight for Diabetics

Losing Weight for Diabetics : మధుమేహం వల్ల కలిగే అనేక సమస్యలు శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు, గుండె జబ్బులు, నోటి సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలకు మధుమేహం వల్ల గురికావాల్సి వస్తుంది. మందులు, జీవనశైలి మార్పులతో వ్యాధి కారణంగా ఎదుర్కొనే కొన్ని రకాల ఈ సమస్యలను నివారించవచ్చు. అంతే కాకుండా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. శరీర బరువులో 5% తగ్గినా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది అనేక ఇతర తీవ్రమైన వ్యాధులు దరిచేరకుండా నిరోధించవచ్చు.

READ ALSO : Diabetes : డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్ధాయిలు పెరగకుండా చూసే కూరగాయలు ఇవే?

టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో 60%, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో 85% మంది అదనపు బరువు, ఊబకాయంతో జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి మధుమేహ రోగులకు బరువు తగ్గడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదనపు బరువు తగ్గడం వల్ల మధుమేహ వ్యాధిని నిర్వహించడం సులభతరమౌతుంది. బరువు తగ్గటమన్నది ఆరోగ్యకరమైన మార్గంలో ఉండాలి. దీని వల్ల వ్యాధిని పూర్తిగా తిప్పికొట్టవచ్చు.

బరువు తగ్గి మంచి శరీర ఆకృతి పొందటం అన్నది మధుమేహం ఉన్నవారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువు వల్ల చాలా మందికి టైప్ 2 డయాబెటిస్‌ను నయం చేసే అవకాశం ఉంది. అయితే బరువు తగ్గడం వల్ల మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో మందులు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పరిస్థితిని పూర్తిగా నయం చేయవచ్చు. శరీర బరువును నిర్వహించడం అంటే 25 కంటే తక్కువ బాడీ-మాస్ ఇండెక్స్ (BMI)ని నిర్వహించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Prevent Diabetes : మధుమేహం ఎలా నివారించాలి ? ప్రారంభ దశలో ఉంటే ఏంచేయాలి ?

టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధికి అనేక కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ, అధిక బరువు అనేది కీలకమైన ప్రమాద కారకం. అధిక బరువుతో ఉన్నట్లయితే శరీరానికి సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి శరీరానికి రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ప్యాంక్రియాస్ అంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించిన వెంటనే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్‌ను తయారు చేయడానికి చాలా తక్కువ కణాలను కలిగి ఉండటం వలన ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఊబకాయం ఉన్న వ్యక్తులకు పొత్తికడుపు కొవ్వు ఎక్కువగా కలిగి ఉండారు.

మధుమేహం ఉన్నవారు బరువు తగ్గడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

1. ప్యాంక్రియాస్ శరీర అవసరాలను తీర్చడానికి ఇన్సులిన్ ఉత్పత్తిని సవ్యంగా చేస్తుంది.

READ ALSO : warm water : స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే రక్తపోటు తగ్గుతుందా?

2. కొన్ని సమయాల్లో, రక్తంలో గ్లూకోజ్‌ని సాధారణ స్థాయికి తీసుకురావడానికి బరువు తగ్గటం బాగా ఉపకరిస్తుంది.

3. బరువు తగ్గటం వల్ల సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలను పూర్తిగా పునరుద్ధరించకపోయినా, ఇన్సులిన్ థెరపీ , ఇతర మధుమేహం మందుల అవసరాన్ని తగ్గించవచ్చు.

4. బరువు తగ్గటం వల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి , నరాల సమస్యలు వంటి ఇతర తీవ్రమైన మధుమేహ సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

5. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కుటుంబంలో మధుమేహం బాధపడుతుంటే వారు బరువును నియంత్రించుకోవడం చాలా
ముఖ్యమని సూచించండి. శరీర బరువు సక్రమంగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశం 30 నుండి 60 శాతం వరకు తగ్గుతుంది.