బొజ్జ ఉన్నవాళ్లకే హార్ట్ అటాక్ ప్రమాదాలు ఎక్కువ

బొజ్జ ఉన్నవాళ్లకే హార్ట్ అటాక్ ప్రమాదాలు ఎక్కువ

అబ్డామిన్ భాగంలో కొవ్వు.. అదేనండి బొజ్జ. హార్ట్ అటాక్‌కు గురవుతున్న వారిలో బొజ్జ ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నాయి రీసెర్చ్‌లు.  ఓ రీసెర్చ్‌లో బొజ్జ భాగంలో ఉండే కొవ్వుపై పరిశోధనలు అధ్యయనం చేసి తొలిసారి గుండెనొప్పి రావాడానికి ఇదే కారణమవుతుందని గతంలోనే చెప్పారు. ప్రస్తుతం స్వీడన్ రీసెర్చర్స్ బొజ్జ భాగంలో కొవ్వు ఉంటే పలు మార్లు హార్ట్ అటాక్ రావొచ్చని తేల్చేశారు. 

ఈ కొవ్వు కారణంగా షేప్ పాడవడం మాట అటుంచితే గుండెనొప్పి, డయాబెటిస్, టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవలసిన అవసరం, రక్తపోటు స్థాయిలో హెచ్చుతగ్గులు వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యకరమైన నడుము భవిష్యత్ గుండె నొప్పులు రాకుండా ఓ రకంగా అడ్డుకోగలదు. ఆరోగ్యంగా ఉండడమంటే మందులు లేకుండా లైఫ్ ని లీడ్ చేయడమేనని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా స్టడీ అండ్ రీసెర్చింగ్ ప్రొఫెసర్ డా. హనీ మొహమ్మదీ అంటున్నారు. 

ఈ అంశంపై పరిశోధన జరిపిన వాళ్లలో మొహమ్మదీ దాదాపు 22వేల మందిపై జరిపి ఎవరూ చేయనంత రీసెర్చ్ జరిపారు. దీనికోసం 3సంవత్సరాల 8నెలల సమయం తీసుకున్నారు. ఈ కొవ్వు కారణంగా ముందు పొట్ట భాగం పెద్దదిగా కావడం తర్వాత గుండెకు రక్తం సరఫరా చేసిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని గుండె నొప్పి రావడం కారణమవుతుంది. 

ఈ ప్రమాదానికి గురైన వారిలో దాదాపు 80శాతం మంది మగాళ్లలో 94సెంటిమీటర్లు(37 అంగుళాలు), మహిళల్లో 90శాతం మంది 80 సెంటిమీటర్లు(31 అంగుళాలు)తో గుండెనొప్పికి గురయ్యారు. పొగ తాగడం, షుగర్ తో బాధపడటం వంటివాటితో గుండెనొప్పి వచ్చే దానికంటే ఈ కొవ్వు కారణంగానే ఎక్కువగా నష్టపోతామని అధ్యయనం చెబుతుంది. 

అమెరికాలోనైతే ప్రతి 37సెకన్లకు ఒకరు కార్డియో వాస్క్యులర్ జబ్బుకు గురవుతున్నారు. 40సెకన్లకొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 8లక్షల అమెరికన్లు హార్ట్ అటాక్ వస్తుంది. వీరిలో 6లక్షల మందికి వస్తుంది తొలిసారి హార్ట్ అటాకే. ఇంక ఓ సారి హార్ట్ అటాక్ వచ్చిందంటే తర్వాత పరిస్థితి అందరికీ తెలిసిందే. 

గాజుబొమ్మలా చూసుకోవలసిందే. సెన్సిటివ్ విషయాలు తెలియకూడదు. బరువైన వస్తువులు ఎత్తకూడదు. పరిగెత్తకూడదు. ఒంటికి కొవ్వు పట్టే వస్తువులు తినకూడదు. ట్యాబ్లెట్ డోస్ మానకూడదు. అదే ముందునుంచే ఆహారంలో జాగ్రత్తలు పాటించి సరిపడ వ్యాయామం చేస్తే ఈ కష్టాల నుంచి బయటపడొచ్చు.