గుడ్ న్యూస్ : బీపీ మాత్రలతో మానసిక రోగాలు నయం

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 06:50 AM IST
గుడ్ న్యూస్ : బీపీ మాత్రలతో మానసిక రోగాలు నయం

బీపీ, షుగర్ వంటి జబ్బులకు వినియోగించే ట్యాబ్లెట్ల గురించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆ ట్యాబ్లెట్లు తీవ్రమైన మానసిక జబ్బులు తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది. ఆ ట్యాబ్లెట్లతో మెంటల్ నయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. స్కీజోఫెర్నియా, బైపోలార్‌ వంటి మానసిక జబ్బులను తగ్గిపోతాయని అధ్యయనం చేసిన నిపుణులు తెలిపారు.

స్వీడన్‌లోని లక్షా 42వేల 691 మంది మానసిక రోగులకు కొలెస్టరాల్‌ను తగ్గించే హైడ్రాక్సీ మిథైల్‌ గ్లటరిల్‌ కోఎంజైమ్‌ను, హై బీపీ కంట్రోల్‌కు వాడే ఎల్‌-టైప్‌ కాల్షియమ్‌ చానెల్‌ అంటాగొనిస్ట్స్ (ఎల్‌టీసీసీ)ను, షుగర్‌కి వాడే మెట్‌ఫార్మిన్‌ వంటి మందులను వాడి ఫలితాన్ని అంచనా వేశారు. బైపోలార్‌ డిజార్డర్‌, స్కీజోఫెర్నియా లక్షణాలైన వ్యక్తిగత హానిని తలపెట్టుకునే పరిస్థితి రోగుల్లో తగ్గుముఖం పట్టినట్టు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను ‘జమ’ సైకియాట్రీ పుస్తకంలో పబ్లిష్ చేశారు. స్వీడన్‌కు చెందిన కరోలికా ఇనిస్టిట్యూట్‌, బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.