కాపర్ వాడితే కరోనా దూరం…నిమిషాల్లోనే వైరస్ చనిపోతుందట!

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2020 / 08:24 AM IST
కాపర్ వాడితే కరోనా దూరం…నిమిషాల్లోనే వైరస్ చనిపోతుందట!

Copper

వేల సంవత్సరాల నుంచే మన పూర్వీకులు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కువగా కాపర్(రాగి) ఉపయోగించేవారన్న విషయం తెలిసిందే. అయితే మనం ఇప్పుడు ఎక్కువగా ఫ్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నామనుకోండి అదూ వేరే విషయం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు కాపర్ తో చెక్ పెట్టవచ్చు అంట. కాపర్ మన చెంత ఉంటే కరోనా మన దరి చేరే అవకాశమే లేదంటున్నారు.

ఇన్ ఫ్యూయంజా,ఈ కోలి వంటి బ్యాక్టీరియా,MRSAవంటి సూపర్ బగ్స్ లేదా ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా గట్టి ఉపరితలంపై ల్యాండ్ అయితే అవి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు జీవించగలదు. అయితే ఆ వైరస్… రాగిపై,మరియు ఇత్తడి వంటి కాపర్ మిశ్రమాలపై ల్యాండ్ అయితే మాత్రం కొన్ని నిమిషాల్లోనే చనిపోతుందని సౌతాంఫ్టన్ యూనివర్శిటీ ఆఫ్ సౌతాంఫ్టన్ లోని ఎన్విరాన్మెంటల్ హెల్త్ కేర్ ఫ్రొఫెసర్ బిల్ కీవిల్ తెలిపారు.

See Also | భారత్@125…చాపకింద నీరులా దేశంలో కరోనా వైరస్

భారత్ లో వేల సంవత్సరాల నుంచి ఏదైనా ద్రవాలు తీగేందుకు కాపర్ కప్ లను ఉపయోగిస్తుంటారని ఆయన తెలిపారు. కాపర్… సాధారణన,నిష్క్రియాత్మ(ఎదురుతిరగని),యాంటీమైక్రోబయాల్ మెటీరియల్ అని ఆయన అన్నారు. ఇది కరెంట్ లేదా బ్లీచ్ అవసరం లేకుండానే దాని ఉపరితలాన్ని స్వీయ-క్రిమిరహితం చేస్తుందన్నారు.

అయితే ఇప్పుడు బహిరంగ ప్రదేశాలలో మరియు ముఖ్యంగా ఆసుపత్రులలో రాగిని తిరిగి తీసుకురావడానికి సమయం ఆసన్నమైందని కీవిల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మహమ్మారిలతో(గ్లోబల్ పాండమిక్స్) నిండిన అనివార్యమైన భవిష్యత్తు దృష్ట్యా…మనమందరం ఆరోగ్య సంరక్షణలో, ప్రజా రవాణా, ఇళ్లలో కూడా రాగిని ఉపయోగించాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్(COVID-19)ను ఆపడానికి చాలా ఆలస్యం అయితే,భవిష్యత్తులో వచ్చే మహమ్మారి గురించి ఆలోచించడానికి సమయం మించిపోలేదని ఆయన అన్నారు.