కరోనా వైరస్ లీక్? : చైనా జీవాయుధాలతో వుహాన్ ల్యాబరేటరికి లింక్?

  • Published By: sreehari ,Published On : January 27, 2020 / 07:50 AM IST
కరోనా వైరస్ లీక్? : చైనా జీవాయుధాలతో వుహాన్ ల్యాబరేటరికి లింక్?

ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి మొదలైన ఈ వైరస్.. తొలుత గబ్బిలాల నుంచి పాముల్లోకి సంక్రమించి వాటిని తిన్న మనుషుల్లోకి వ్యాపించినట్టు ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ మూలం ఎక్కడ అనేదానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వుహాన్ సిటీలోని సీఫుడ్ మార్కెట్లో అమ్మే పాములు, జంతువుల మాంసం నుంచే పాకిందని అంచనా వేస్తున్నప్పటికీ కచ్చితమైన ఆధారాల కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు.. ఈ కరోనా వైరస్ మూలం ఎక్కడ నుంచి ఉద్భవించింది అనేదానిపై ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 

ల్యాబరేటరీలతో సంబంధం ఉందా? :
వైరస్ విజృంభించిన వుహాన్ సిటీలోని రెండు ల్యాబరేటరీల నుంచే డెడ్లీ కరోనా.. లీక్ అయినట్టు ఇజ్రాయెల్ బయోలాజికల్ వార్ ఫేర్ నిపుణులు ఒకరు వెల్లడించారు. చైనాలో రహాస్య జీవాయుధాల తయారీ(బయోలాజికల్ వెపన్స్ ప్రొగ్రామ్)కేంద్రంతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు తెలిపారు. వూహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీగా పేరొందిన చైనాలోని అత్యంత అడ్వాన్స్ డ్ వైరస్ రీసెర్చ్ ల్యాబరేటరీగా రేడియో ఫ్రీ ఏసియా రిపోర్టు ఈ వారమే నివేదించింది. 2015లోని స్థానిక వుహాన్ టెలివిజన్ రిపోర్టును రేడియో ఫ్రీ ఏసియా రీబ్రాడ్ క్యాస్ట్ చేసింది. ఈ ల్యాబరేటరీ అనేది.. చైనాలో ప్రాణాంత వైరస్ లపై పరిశోధన చేసే సామర్థ్యం గల ఒకే ప్రదేశంగా మాత్రమే ప్రకటించినట్టు నివేదించింది.

చైనీస్ క్రిమి జనిత యుద్ధంపై అధ్యయనం చేసిన ఇజ్రాయెల్ మిలటరీ ఇంటిలిజెన్స్ మాజీ అధికారి డానీ సోహామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీజింగ్ లోని రహాస్య జీవాయుధాల కర్మాగారంతో ఈ వుహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీకి లింక్ ఉందని ఆయన అన్నారు. ‘చైనాలోని ఈ సంస్థలో నిర్దిష్ట ల్యాబరేటరీల్లో ఎప్పటికప్పుడూ రీసెర్చ్, డెవలప్ మెంట్ వంటి కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. డ్యుయల్ సివిలియన్ మిలటరీ రీసెర్చ్‌లో భాగంగా ఇక్కడ జీవాయుధాలపై వర్క్ జరుగుతుంటుంది. అది కూడా ఎంతో రహాస్యంగా ఉంటుందని ఆయన ఈమెయిల్ ద్వారా వెల్లడించారు. 

మెడికల్ మైక్రోబయాలజీలో షోహామ్ డాక్టరేట్ పొందారు. 1970 నుంచి 1971 వరకు ఇజ్రాయెల్ మిలటరీ ఇంటిలిజెన్స్‌లో ప్రపంచం వ్యాప్తంగా మధ్య తూర్పులో జీవసంబంధ, రసాయన యుద్ధాలకు సంబంధించి ఒక సీనియర్ విశ్లేషకుడిగానూ లెప్టినెంట్ కల్నల్ హోదాలో పనిచేశారు. గతంలో చైనా తమ వద్ద ఎలాంటి ప్రమాదకర జీవాయుధాలు ఉన్నాయని అనే ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. గత ఏడాదిలో రాష్ట్ర శాఖ ఒక రిపోర్టును వెల్లడించింది. అందులో చైనా రహాస్యంగా బయోలాజికల్ వార్ ఫేర్ పై వర్క్ చేస్తుందనే  అనుమానాలు తలెత్తాయి కూడా. అయితే దీనిపై చైనా రాయబారి కార్యాలయ ప్రతినిధి మెయిల్ ద్వారా కామెంట్ చేసేందుకు తిరస్కరించారు. 

జంతువుల మాంసం నుంచేనా? :
మరోవైపు చైనా అధికారులు కూడా ఇప్పటివరకూ కరోనా వైరస్ మూలం ఎక్కడ ఉంది అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. సెంట్రల్ హుబేయి ప్రావిన్స్ లో వందల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ వ్యాప్తికి వుహాన్ సిటీలోని సీఫుడ్ మార్కెట్లో దొరికే అడవి జంతువుల మాంసం నుంచే ఉద్భవించి ఉండొచ్చునని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ గావో ఫూ సంకేతాలు ఇచ్చారు. యూఎస్ కుట్రలో భాగంగానే ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా చేసిందంటూ కొన్నివారాలుగా చైనా ఇంటర్నెట్ లో రుమార్లు వస్తున్నట్టు పేరు చెప్పేందుకు అంగీకరించని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. 

ఇదిలా ఉండగా, భవిష్యత్ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి చైనా ప్రచార కేంద్రాలను సిద్ధం చేస్తోందని సంకేతాలిస్తోంది. అంటే.. కొత్త వైరస్ వుహాన్ పౌర లేదా రక్షణ పరిశోధన ప్రయోగశాలలలో ఒకదాని నుంచి తప్పించుకున్నట్టు సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మైక్రోబ్ కొత్త కరోనా వైరస్ 2019-nCoV అని పిలుస్తోంది. జెనీవాలో గురువారం జరిగిన సమావేశంలో ఈ సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ప్రకటించడాన్ని నిలిపివేసింది. ఈ వైరస్ వ్యాప్తితో న్యుమోనియా లాంటి లక్షణాలకు కారణమవుతుంది. దీని వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో ఈ వారమే వుహాన్ కు సైనిక దళాలను కూడా చైనా మోహరించింది. 11 మిలియన్ల జనాభా ఉన్న నగరం నుంచి అన్ని రవాణా సర్వీసులు రద్దు చేయడం జరిగింది.

కరోనా వైరస్ లీక్ అయిందా? : 
కొత్త కరోనావైరస్ లీక్ అయి ఉండొచ్చా అని అడిగిన ప్రశ్నకు బదులుగా షోహమ్ మాట్లాడుతూ.. ‘సూత్రప్రాయంగా చెప్పాలంటే.. కరోనా వైరస్ లీకేజీ అయి ఉండొచ్చు లేదా ప్రయోగశాలలో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తికి సోకిన విషయం గుర్తించకపోవడంతో అది ఇతరులకు సంక్రమించి ఉండొచ్చు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విషయంలో ఇది జరిగి ఉండవచ్చు. కానీ ఇంతవరకు అలాంటి సంఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేదా సూచనలు ఏమి లేవు’ అని అన్నారు.

ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనలైజెస్ పత్రికలో జూలైలో వచ్చిన కథనంలో..  జీవ ఆయుధాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలలో నాలుగు చైనా ప్రయోగశాలలలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఒకటిగా ఉందని షోహమ్ తెలిపారు. గతంలో వ్యాపించిన ఎబోలా, నిపా, క్రిమియన్-కాంగో రక్తస్రావ జ్వరం వంటి ప్రాణాంతక వైరస్‌లపై పరిశోధనలను నిర్వహించిన ఇదే సంస్థలో సురక్షితమైన వుహాన్ నేషనల్ బయో సేఫ్టీ లాబొరేటరీని గుర్తించినట్టు ఆయన తెలిపారు.