సిమ్లా, ముస్సూరీ కంటే.. ఢిల్లీలోనే ఎందుకింత చలి?

  • Published By: sreehari ,Published On : December 30, 2019 / 09:19 AM IST
సిమ్లా, ముస్సూరీ కంటే.. ఢిల్లీలోనే ఎందుకింత చలి?

దేశ రాజధాని ఢిల్లీలో చలి చంపేస్తోంది. నగరవాసులను గజగజ వణికిస్తోంది. వింటర్ సీజన్ కావడంతో చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే ఢిల్లీవాసులు వణికిపోతున్నారు. సాధారణంగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు పర్వతాల పైకెళ్లి సేద తీరుతుంటారు. కానీ, ఢిల్లీ-NCRలో డిసెంబర్ నెలలో మాత్రం గడ్డు కట్టించేంత చలి పెరిగిపోయింది. 119ఏళ్లలో డిసెంబర్ నెలలో చలి తీవ్రత ఈ స్థాయికి చేరుకోవడం ఇది రెండోసారి.

గడిచిన 100 ఏళ్లలో 4 ఏళ్లలో (1919, 1929, 1961, 1997) మాత్రమే ఉష్ణోగత్రలు ఒక్కసారిగా పడిపోయాయి. శతాబ్ద కాలంలో 1997 తర్వాత అది డిసెంబర్ నెలలోనే 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2019 ఏడాదిలో డిసెంబర్ 26 వరకు గరిష్టంగా 19.85 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రసిద్ధ పర్వత ప్రాంతాలైన సిమ్లా, ముస్సూరీ కంటే ఢిల్లీలోనే చలి తీవ్ర స్థాయిలో నమోదువుతోంది. 

పగటి పూట, రాత్రి సమయాల్లోనే చలి తీవ్రత మరింత ఎక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ చెబుతోంది. వారాంతంలో సిమ్లా, ముస్సూరీ పర్వత నగరాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 14 డిగ్రీల సెల్సియస్ దగ్గర నమోదయ్యాయి. దేశ రాజధానిలో పగటి, రాత్రి సమయం రెండింటిలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం నాడు ఢిల్లీలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అయ్యాయి.

మంచు కారణంగానే :
పలు వాతావరణ శాఖల్లో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల్లో జఫర్ పూర్ (11.6), ముంగేస్ పూర్ (11.9), పాలమ్ (13.5) తోపాటు ఇతర ప్రాంతాల్లో 14 లోపు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ ప్రాంతాల్లోనే ఎందుకింత ఎక్కువగా చలి పెరిగిందో వాతావరణ శాఖ అధికారులు కారణం వెల్లడించారు. పగట పూట మొత్తం మంచు కప్పేసి ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. 

మంచు ఎక్కువగా పడటం వల్ల సూర్యరశ్మి నేలను తగలకుండా అడ్డుకుంటోందని, దాంతో మిగతా రోజుంతా అక్కడ వేడిగా ఉంటోందని తెలిపారు. సిమ్లా, ముస్సూరీ కొండ ప్రాంతాల్లో కంటే శనివారం ఢిల్లీలోని రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అయినట్టు చెప్పారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆదివారం కూడా సిమ్లా కనిష్టంగా 2.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ముస్సూరీ కంటే సిమ్లా ఇతర ప్రాంతాల్లోనే మరింత చలిగా ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

గత కొన్ని రోజులుగా పర్వత ప్రాంతాల్లో వర్షాలు కూడా లేవు. ఒకవేళ సిమ్లా లేదా ముస్సూరీలో ఉదయం వేళలో మంచు కురిసినా.. మిగతా రోజుంతా సూర్యరశ్మి పడి భూమి వేడిక్కే అవకాశం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. వాతావరణం తేమగా లేనప్పటికీ.. వారంతంలో సిమ్లా, ముసూరీ ప్రాంతాల్లోని పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు సాధారణంగా కంటే నమోదు అవుతున్నాయి.