Pomegranate Juice : ఈ జ్యూస్ తాగితే నరాలకు శక్తినిస్తుంది… కండరాలను బలపరుస్తుంది !

దానిమ్మపండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అవి మంట , ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి నరాలకు బలాన్ని ఇస్తాయి. ఇందులోని మెగ్నీషియం నరాలు , కండరాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Pomegranate Juice : ఈ జ్యూస్ తాగితే నరాలకు శక్తినిస్తుంది… కండరాలను బలపరుస్తుంది !

Pomegranate Juice

Updated On : May 11, 2023 / 12:36 PM IST

Pomegranate Juice : దానిమ్మఐరన్‌తో సహా అనేక పోషకాలతో కూడిన పండు. దానిమ్మ రసంలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె మరియు మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. నరాల బలహీనతను తొలగించుకోవటానికి దానిమ్మలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ తోడ్పడతాయి. ఇవి నరాలు , కండరాలకు సమర్థవంతంగా తోడ్పడతాయి.

READ ALSO : Amla Ginger Juice : అలసటగా ఉంటోందా? ఈ జ్యూస్ ట్రై చేయండి

దానిమ్మ రసం నరాలకు మేలు చేస్తుంది ;

దానిమ్మపండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అవి మంట , ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి నరాలకు బలాన్ని ఇస్తాయి. ఇందులోని మెగ్నీషియం నరాలు , కండరాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

READ ALSO : Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !

దానిమ్మ రసం కండరాల బలాన్ని పెంచుతుంది ;

దానిమ్మ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి కండరాల బలాన్ని పెంచుతుంది. దీనిలో ఉండే ఇనుము శరీరంలో రక్తహీనతను తొలగిస్తుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

READ ALSO : Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే క్యాబేజీ జ్యూస్ !

దానిమ్మ రసం ఎప్పుడు, ఎలా తీసుకోవాలి ;

కనీసం రోజుకు ఒక్కసారైనా దానిమ్మ రసం తాగాలి. తాజా రసం తీసి త్రాగటం మంచిది. ఇది కండరాలు , నరాలకు మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.