Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే క్యాబేజీ జ్యూస్ !

క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే క్యాబేజీ జ్యూస్ !

Cabbage juice that reduces belly fat!

Updated On : February 13, 2023 / 10:05 AM IST

Belly Fat : క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడానికి, శరీరంలోని కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది. క్యాబేజీ రసం శరీరాన్ని సరైన ఆకారంలో ఉంచటానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనేక ఆరోగ్యకరమైన పానీయాలు ఎంతగానో సహాయపడతాయి. అలాంటి వాటిలో ఒకటి క్యాబేజీ రసం. క్యాబేజీ రసం బరువు తగ్గటంలో సహాయపడటమే కాదు కాలేయం వంటి మీ శరీరంలోని ముఖ్యమైన అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

క్యాబేజీ అనేది పొటాషియం, విటమిన్ సి మరియు సల్ఫర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు జ్యూస్ ద్వారా A, B, E, C, మరియు K, కాల్షియం, అయోడిన్, పొటాషియం మరియు సల్ఫర్‌లు శరీరానికి అందుతాయి. ఇది అన్ని ఆకు కూరలలో ఒక సూపర్‌హీరోగా చెప్పవచ్చు. బరువు తగ్గడానికి మరియు శరీర కొవ్వును కాల్చడానికి మీ రోజువారీ ఆహారంలో క్యాబేజీని తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బరువు తగ్గటం కూడా చాలా సులభతరం అవుతుంది. 10 రోజుల వ్యవధిలోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

క్యాబేజీ జ్యూస్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది, తద్వారా కోరికలు, ఆకలి బాధలను నివారిస్తుంది. అదనపు కేలరీలను తీసుకునే అవకాశాలను తగ్గిస్తుంది. ఇతర పానీయాలతో పోలిస్తే క్యాబేజీ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి, అందుకే దీనిని బరువు తగ్గించే పానీయంగా పరిగణిస్తారు. ఒక కప్పు క్యాబేజీ రసంలో 22 కేలరీలు మరియు అతితక్కువ కొవ్వు ఉంటుంది. క్యాబేజీ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి శరీరంలో సెల్-డ్యామేజింగ్ ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ప్రేగులలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ తొలగించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గడానికి మంచి జీర్ణవ్యవస్థ కీలకం. క్యాబేజీ రసంలో యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలేయం శరీరం యొక్క పనితీరులో కీలక పాత్ర పోషించే ఒక అవయవంగా చెప్పవచ్చు.

క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ క్యాబేజీ జ్యూస్‌ తాగితే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా కరుగుతుంది. క్యాబేజీలో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. క్యాబేజీలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

బరువు తగ్గడానికి క్యాబేజీ రసం ఎలా తయారు చేయాలి?

క్యాబేజీని తీసుకుని కొంత బాగాన్ని కోసుకుని పక్కన పెట్టుకోవాలి. జ్యూస్ రుచికరంగా ఉండాలంటే ఇతర కూరగాయలు లేదా అల్లం మరియు ఆపిల్ వంటి పండ్లను దీనికి చేర్చుకోవచ్చు. ఆ ముక్కలను నీళ్లతో కలిపి నాలుగైదు నిమిషాలు ఉడకబెట్టాలి. ఇప్పుడు ఉడికించిన ముక్కలను తీసుకుని బ్లెండ్ చేయాలి. ఒక గ్లాసు తీసుకుని అందులో జ్యూస్ పోసి అందులో కాస్త నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇంతే క్యాబేజీ జ్యూస్ సిద్ధమైనట్లే!