Control Blood Sugar Levels : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తోడ్పడే పానీయాలు !

ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చియా గింజలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి దానికి నిమ్మకాయ ముక్కలను యాడ్ చేయాలి.

Control Blood Sugar Levels : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తోడ్పడే పానీయాలు !

control blood sugar levels

Control Blood Sugar Levels : రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం అనేది సాధరమైన విషయం కాదు. ఆహారం, క్రమశిక్షణ, చురుకైన జీవనశైలి కలిగి ఉండటం ద్వారానే ఇది సాధ్యమౌతుంది. మధుమేహం అన్నది అనేక రకాల జీవనశైలి మార్పులతో వస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను సరిచేసేందుకు, జీవనశైలిలో మార్పులు చేసేందుకు కొంత సమయం పడుతుంది.

READ ALSO : Diabetes Affects The Skin : మధుమేహం చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? ఈ లక్షణాల కనిపిస్తే జాగ్రత్త పడటం మంచిది..

ఉదయం జీవక్రియ రుగ్మతతో బాధపడుతున్నట్లైతే మూలికలు, మొక్కల ఆధారిత ఆహారాలు, విత్తనాలు తీసుకోవడం ద్వారా మధుమేహానికి అనుకూలమైన రీతిలో రోజంతా గడిపేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పెరుగుదలను నిరోధించవచ్చు. దినచర్యలో మార్పును చేయగలిగితే కోరికలు, శక్తి స్థాయిలు, మానసిక స్థితి మెరుగుపడితే రోజు మొత్తం ఆనందంగా గడపవచ్చు. ఇందుకు కొన్ని రకాల పానీయాలు సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పానీయాలు ;

1. మెంతి గింజల నీరు ; మెంతి గింజలు సహజంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి దోహదపడతాయి. కరిగే ఫైబర్ , సపోనిన్స్ మెంతి గింజలలో అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ , కార్బోహైడ్రేట్ల శోషణను మందగించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మెంతి గింజలు కొలెస్ట్రాల్ , రక్తపోటును తగ్గించడానికి ఒక సూపర్ ఫుడ్.

READ ALSO : కాఫీతో మధుమేహం దూర‌మవుతుందా?

మేతి గింజల నీరు చర్మం , స్కిన్ రంగు మారడాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. మెంతి సీడ్ వాటర్‌ ను ఉదయం నిద్రలేవగానే తీసుకోవటం వల్ల రోజంతా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. 1-2 టేబుల్ స్పూన్ల విత్తనాలను రాత్రిపూట నానబెట్టి ఉదయం బాగా మరిగించి టీగా త్రాగాలి.

2. ఉసిరి అలోవెరా రసం ; ఉసిరి , కలబంద శక్తివంతమైన కలయిక ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఉసిరికాయ యాంటీ-డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అలోవెరా మధుమేహం ఉన్నవారికి ప్రయోజనాలను అందిస్తుంది, ఒక అధ్యయనంలో అలోవెరా జెల్ తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచటంలో సహాయపడుతుందని నిరూపణ అయింది. చర్మ సమస్యలకు తగ్గిస్తుంది. ఉసిరి అలోవెరా తేనె, చక్కెర, నిమ్మరసం, మిరియాల పొడి కలుపుకొని తీసుకోవచ్చు. ఉసిరి అలోవెరా రసాన్ని తాగినా ఫలితం ఉంటుంది.

READ ALSO : Benefits Of Niacinamide : జుట్టు ఆరోగ్యానికి నియాసినామైడ్ తో అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసా ?

3. చియా విత్తనాలు నీరు ; ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చియా గింజలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి దానికి నిమ్మకాయ ముక్కలను యాడ్ చేయాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, చర్మం పొడిబారకుండా నివారించటంలో సహాయపడుతుంది.

4. తులసి టీ ; తులసిలో హైపోగ్లైసీమిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. మధుమేహం సమస్యలను నివారించటంలో సహాయపడుతుంది. తులసి ఇన్సులిన్ సెన్సిటివిటీ ,గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లను నిర్వహించడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. తులసి టీలో అల్లం మరియు నిమ్మరసం జోడించవచ్చు.

READ ALSO : Ginger Juice : అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలను తగ్గించే అల్లం రసం!

5. ధనియా గింజల నీరు ; కొత్తిమీర గింజలు వీటినే ధనియాలు అంటారు. వీటిలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి మంటను , ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఇన్సులిన్ చర్యను కూడా నిర్వహిస్తాయి. ధనియాల వాటర్ తీసుకోవడం థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా సహాయపడుతుంది.