Influenza ఫ్లూ కంటే Covid-19 ప్రాణాంతకమా? రెండూ డేంజరే ‘twindemic’ వైద్యుల హెచ్చరిక

  • Published By: sreehari ,Published On : October 4, 2020 / 03:29 PM IST
Influenza ఫ్లూ కంటే Covid-19 ప్రాణాంతకమా? రెండూ డేంజరే ‘twindemic’ వైద్యుల హెచ్చరిక

Influenza-Covid-19 : ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తోడు ఫ్లూ సీజన్ కూడా వస్తోంది. ఇప్పటివరకూ Pandemic పిలిస్తున్నారు.. ఇన్ఫ్లూయెంజా ఫ్లూ ఎంట్రీతో ‘twindemic’ మహమ్మారిగా రూపాంతరం చెందబోతోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమై ఆరు నెలలు దాటేసింది..

SARS-CoV-2 అనే వైరస్ జాతి ద్వారా COVID-19 వ్యాధి వ్యాపిస్తోంది. సాధారణంగా అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి మధ్య ‘twindemic’ లోకి ప్రవేశించబోతున్నాయిని అంటు వ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్లూకు కారణమయ్యే వైరస్లలో ఇన్ఫ్లుఎంజా A, B లతో కలిసి పాటు కరోనా వైరస్ ‘twindemic’గా రూపాంతరం చెందబోతుందని హెచ్చరిస్తున్నారు.



ఇప్పటివరకు, యునైటెడ్ స్టేట్స్‌లో 7 మిలియన్లకు పైగా కరోనా కేసులు ఉన్నాయి. కరోనావైరస్ బారినపడి 2లక్షల మంది మరణించారు. రోజుకు 43.100 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఫ్లూ ముప్పును నివారించే దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. Influenza ఫ్లూ కంటే COVID-19 ప్రాణాంతకమా? అంటే Influenza ఫ్లూ వైరస్ బలహీనమేమి కాదని ప్రొఫెసర్ విలియం షాఫ్ఫ్నర్ అంటున్నారు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అంచనాల ప్రకారం.. ప్రతి ఏడాదిలో ఫ్లూ బారిన 10 లక్షల మంది అమెరికన్లను అనారోగ్యానికి గురవుతున్నారు. 140,000 నుంచి 810,000 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఫ్లూ కారణంగా 12,000 నుంచి 61,000 మంది బలైపోయారు. కరోనా మాదిరిగానే ఫ్లూ వైరస్ లోనూ అత్యంత అంటు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ తీవ్రమైన అనారోగ్యం తేలికపాటి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి ఉమ్మడి లక్షణాలు కనిపిస్తుంటాయి.



Influenza ఫ్లూ కంటే COVID-19 ప్రాణాకంతమా? :
అంటే.. ఈ రెండు వైరస్ లు అత్యంత ప్రాణాంతకమైనవి.. రెండింటి మధ్య తేడాను గుర్తించలేమంటున్నారు. లక్షణాలు, తీవ్రతలో దగ్గరి పోలికలు ఉంటాయని చెబుతున్నారు. మరింత తీవ్రమైనది ఏదంటే.. COVID-19 అని డాక్టర్ విలియం చెప్పారు. కరోనావైరస్ పూర్తిగా కొత్తది.. అంటువ్యాధి కావడంతో అందరికి అంటుకునే అవకాశం ఉంది. కరోనాకు ఇప్పటివరకూ ఎలాంటి మందు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు.



మరోవైపు ఫ్లూ వైరస్‌పై అనేక అధ్యయనాలు జరిగాయి. యాంటీవైరల్ ఔషధాలతో చికిత్స చేయవచ్చు. ఒక వార్షిక ఫ్లూ షాట్ ఇస్తే.. 40శాతం నుంచి 60శాతం వరకు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. COVID-19 ఫ్లూ రెండూ వైరస్‌లూ ప్రధానంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి శ్వాసకోశ బిందువుల ద్వారా సంక్రమిస్తోంది. సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు.. దగ్గు లేదా తుమ్ముతున్నప్పుడు ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది.

అందులోనూ సూపర్-స్ప్రెడర్ల ద్వారా వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. గత ఫ్లూ సీజన్‌లో ప్రతి 100,000 మందిలో 66.4 మంది యునైటెడ్ స్టేట్స్‌లో ఫ్లూతో ఆస్పత్రి పాలయ్యారు. CVC ప్రకారం.. ఇప్పటివరకు COVID-19 కారణంగా ఆసుపత్రి పాలైన ప్రతి 100,000 మందిలో 174.8 శాతం ఉన్నారు.కేస్ ప్రాణాంతక రేటు (CFR) వ్యాధితో బాధపడుతున్న మొత్తం వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే.. ఒక వ్యాధి నుండి మరణాల నిష్పత్తి, ఫ్లూకి 0.1శాతం, COVID-19 0.5శాతం కావచ్చు.



ఫ్లూ, కోవిడ్-19 నుంచి జాగ్రత్తలివే :
* బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరాన్ని పాటించండి.
* 6 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ దూరంలో వైరస్ అవకాశాలు తక్కువ.
* బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించండి.
* సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు చేతులను తరచుగా కడగాలి.
* కనీసం 60% ఆల్కహాల్‌తో హ్యాండ్ శానిటైజర్‌ను వాడండి.
* ఇంటిలోని ఉపరితలాలను తరచుగా శానిటైజ్ చేస్తుండాలి.
* తుమ్ము లేదా దగ్గు ఉన్నప్పుడు నోరు కప్పుకోండి.
* కళ్ళు, ముక్కు, నోటిని తాకడం వంటివి చేయొద్దు.
* అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేయండి.
* పెద్ద సమావేశాలకు దూరంగా ఉండండి.
* COVID-19 లేదా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఉండండి.
*ఎవరితో కలవకుండా ఐసోలేట్ అయి వైద్యుడిని సంప్రదించండి.