ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఆస్పత్రి పాలైన వైద్యురాలు.. మెదడు, వెన్నులో వాపు..!

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఆస్పత్రి పాలైన వైద్యురాలు.. మెదడు, వెన్నులో వాపు..!

Mexican doctor hospitalized after receiving COVID-19 vaccine : ఫైజర్-బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 32ఏళ్ల మెక్సికో మహిళా వైద్యురాలు ఆస్పత్రి పాలైంది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఒక్కసారిగా మూర్ఛ పోయింది. శ్వాస తీసుకోలేకపోవడం, ఒళ్లంతా మంట, చర్మంపై దద్దర్లు వంటి అలర్జీ సమస్యలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

ఫైజర్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే జరిగిందా? అని వైద్యాధికారులు అధ్యయనం చేస్తున్నారు. న్యువో లియోన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరింది. ప్రాథమిక రోగ నిర్ధారణలో ‘encephalomyelitis’తో వైద్యురాలు బాధపడుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

‘ఎన్సెఫలోమైలిటిస్’ మెదడు, వెన్నుపాము వాపు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మెక్సికో వైద్యురాలికి ఇదివరకే అలర్జీ సమస్య ఉందని నిర్ధారించారు. దీని కారణంగానే వ్యాక్సిన్ తీసుకున్నాక మెదడువాపు, వెన్నుముకలో వాపుకు దారితీసిందని అంటున్నారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నుంచి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రిత్వశాఖ పేర్కొంది. దీనిపై ఫైజర్‌, బయోంటెక్ కూడా స్పందించలేదు.

మెక్సికోలో కరోనా మహమ్మారికి 1,26,500 మంది మృత్యువాతపడ్డారు. మెక్సికోలో కరోనాతో 126,500 మందికి పైగా మరణించారు. డిసెంబర్ 24న హెల్త్ కేర్ వర్కర్లకు తొలి దశలో కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది.