కరోనా తగ్గినవారిలో దీర్ఘకాలిక లక్షణాలు.. అధిక అలసట, ఊపిరాడటం లేదంట..!

  • Published By: sreehari ,Published On : September 15, 2020 / 06:36 PM IST
కరోనా తగ్గినవారిలో దీర్ఘకాలిక లక్షణాలు.. అధిక అలసట, ఊపిరాడటం లేదంట..!

Redefining Covid-19: Months after infection : కరోనా నుంచి కోలుకున్నాక కూడా చాలామంది బాధితుల్లో వైరస్ ప్రభావం తగ్గడం లేదు.. ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి.. కొన్ని నెలలవరకు కరోనా ఇన్ఫెక్షన్ అలానే ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు.. కరోనా నుంచి కోలుకున్న వారిలో మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు ఈ ఇన్ఫెక్షన్ సమస్యలు బాధిస్తూనే ఉన్నాయని అంటున్నారు.. ప్రధానంగా కరోనా ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత చాలామందిలో అధికంగా అలసటగా ఉండటం.. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తోందని రిపోర్టు చేస్తున్నారు.

యూకేలోని Lucy Gahan అనే మహిళ కోవిడ్-19 నుంచి కోలుకుని ఐదు నెలలు కావొస్తున్న ఆమె ఇంకా నార్మల్ కాలేదని వైద్యులు తెలిపారు. తాను ఎప్పటిలానే తిరిగి వర్క్ చేయలేని పరిస్థితికి చేరుకుంది.. కరోనా ఇన్ఫెక్షన్ ప్రభావంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.. కాళ్లు చేతుల్లో తిమ్మిరి, హృదయ స్పందనలో మార్పులు కనిపించాయి.. ఏ చిన్న పనిచేసినా కూడా గుండె వేగం పెరిగిపోతోంది..



ఇక మే, జూన్ నెలలో అయితే కొంచెం కూడా మాట్లాడలేని పరిస్థితి ఎదురైందని ఆమె వాపోయింది. ఏప్రిల్ ఆరంభంలో కరోనా సోకడానికి ముందు తన రెగ్యులర్ యోగాలో భాగంగా తన తల్లితోపాటు వారంలో మూడుసార్లు అటుఇటు నడిచేవాళ్లమని చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వేలాది మందిలో కరోనా దీర్ఘకాలిక లక్షణాలుగా మారింది లుచీ గాహన్ ఒకరే.. కరోనా సోకినవారిలో ఎక్కువ మంది కోలుకున్నాక కొన్ని నెలలకు క్యూర్అ యిపోతారు. కానీ, Lucy వంటి మహిళల్లో మాత్రం కరోనా ప్రభావిత లక్షణాలు దీర్ఘకాలికంగా బాధిస్తుంటాయని నిపుణులు తెలిపారు.



కరోనాతో ఆస్పత్రిలో చేరినవారిలో మూడు వంతుల మంది దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నారు.. యూకేలోని నార్త్ బ్రిస్టల్ ట్రస్ట్ కు చెందిన Academic Respiratory Unit పరిశోధకుల ప్రకారం.. 110 మంది కరోనా పేషెంట్లు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఐదు రోజుల పాటు ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. 12 రోజుల తర్వాత కరోనా బాధితులకు ఆస్పత్రి నుంచి పంపించారు.. అందులో 74శాతం మందిలో కరోనా లక్షణాలను నివేదించారు. ఎక్కువ మందిలో ఊపిరి ఆడకపోవడం, అధిక అలసట వంటి లక్షణాలు కనిపించాయి.



ఈ లక్షణాలు కనిపించినప్పటికీ 110 మంది బాధితుల్లో 104 మందికి నిర్వహించిన టెస్టుల్లో సాధారణ ఫలితాలే కనిపించాయి. 12శాతం మందిలో ఛాతిలో అసాధారణ మార్పులు కనిపించాయి.. మరో 10 శాతం మందిలో ఊపిరితిత్తులో శ్వాసపరమైన సమస్యలను నిర్ధారించారు. British Medical Journal విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కరోనా పాజిటివ్ తేలిన వారిలో 10 శాతం మంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేసింది.