డెంగ్యూ యాంటీబాడీలతో Covid-19కు ఇమ్యూనిటీ

  • Published By: sreehari ,Published On : September 22, 2020 / 04:34 PM IST
డెంగ్యూ యాంటీబాడీలతో Covid-19కు ఇమ్యూనిటీ

Dengue Immunity : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని అంతం చేసే అసలైన వ్యాక్సిన్ లేదు.. ప్రస్తుతానికి అందిస్తున్న చికిత్సలు కేవలం తాత్కాలికమే..

కరోనా బాధితుల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు మాత్రమే తప్ప పూర్తిగా కరోనాను నిర్మూలించడం సాధ్యపడదు.



మరో ప్రాణాంతక వ్యాధి డెంగ్యూ జ్వరం.. దోమల ద్వారా వ్యాపించే ఈ డెంగ్యూ జ్వరంతో ప్లేట్ లేట్స్ పడిపోతాయి.. అంటే.. రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.

డెంగ్యూ జ్వరం నుంచి కోలుకున్నవారిలో అధిక స్థాయిలో యాంటీబాడీలు తయారవుతాయి.

ఈ యాంటీబాడీలతో కరోనా నుంచి కొంత స్థాయి వరకు ఇమ్యూనిటీ అందిస్తుందని బ్రెజిల్‌లోని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.



Duke University ప్రొఫెసర్ Miguel Nicolelis నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో 2019, 2020 మధ్యకాలంలో జియోగ్రాఫికల్ కరోనా కేసులతో వ్యాప్తి చెందిన డెంగ్యూ కేసుల డేటాతో పోల్చి చూశారు.

కరోనా వైరస్ వ్యాప్తి, డెంగ్యూ జ్వరాలకు మధ్య సంబంధం ఉందని అధ్యయనంలో తేలింది.

ఈ ఏడాదిలో కరోనా ఇన్ఫెక్షన్లు రేట్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి బారినపడి బాధితులే ఎక్కువగా ఉన్నారని గుర్తించామని నికొలస్ బృందం పేర్కొంది.

డెంగ్యూ వ్యాప్తికి కారణమయ్యే Flavivirus serotypes వైరస్, SARS-CoV-2 వైరస్ మధ్య రోగనిరోధకతకు మధ్య రహస్య సంబంధం ఉందని గుర్తించామన్నారు.



డెంగ్యూ వైరస్ యాంటీ బాడీలు కొత్త కరోనా వైరస్ ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించగలిగాయని గుర్తించారు..

ఇదేగాని రుజువైతే.. hypothesis ద్వారా డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే సురక్షితమైన డెంగ్యూ వ్యాక్సిన్ కొంతమేరకు కరోనా వైరస్ పై రోగనిరోధక స్థాయిలను పెంచుతుందని పేర్కొంది.



డెంగ్యూ యాంటీబాడీల బాధితుల బ్లడ్ టెస్టు చేస్తే.. కరోనా వైరస్ లేకపోయినా కోవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టుగా చూపిస్తోందని నికొలస్ తెలిపారు.

ఈ రెండింటి వైరస్ ల మధ్య రోగనిరోధక దృష్ట్యా సంబంధం ఉందనే సంకేతాలు చూస్తోంది.