Sweet Corn : మలబద్ధకం సమస్యను పోగొట్టే స్వీట్ కార్న్ !

ఆరోగ్యకరమైన ఆహారంలో మొక్కజొన్న ప్రధానమైనది నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, తాజా మొక్కజొన్నలో కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్, కొవ్వు, డైటరీ ఫైబర్, ప్రోటీన్ లు ఉంటాయి.

Sweet Corn : మలబద్ధకం సమస్యను పోగొట్టే స్వీట్ కార్న్ !

Sweet corn

Sweet Corn : మలబద్ధకం అనేది ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తున్న తీవ్రమైన సమస్య. మలబద్ధకం వల్ల కడుపులో అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. నిశ్చల జీవనశైలి, చెడు ఆహార అలవాట్లు, జంక్‌ ఫుడ్‌, వేయించిన ఆహారం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, సరిగ్గా నీరు తాగకపోవడం, ఫైబర్‌ ఎక్కువగా తీసుకోకపోవడం, నీరు తక్కువగా తీసుకోవడం, శారీరరక శ్రమ లేకపోవడం, ఆహారంలో ఫైబర్‌ తక్కువగా ఉండటం, బలహీనమైన జీవక్రియ, రాత్రిపూట ఆలస్యంగా తినడం, నిశ్చల వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.

READ ALSO : Thyroid Problems : థైరాయడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోకపోయినా శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. మలబద్ధకం దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్‌, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి చికిత్సలు, మెడిసిన్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ రోజువారి డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవటం ద్వారా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

READ ALSO : Stress Cause Diabetes : ఒత్తిడి మధుమేహానికి కారణమవుతుందా?

ఆరోగ్యకరమైన ఆహారంలో మొక్కజొన్న ప్రధానమైనది నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, తాజా మొక్కజొన్నలో కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్, కొవ్వు, డైటరీ ఫైబర్, ప్రోటీన్ లు ఉంటాయి. అనేక ఇతర పండ్లు మరియు కూరగాయలతో పోలిస్తే, మొక్కజొన్నలో విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

యాంటీఆక్సిడెంట్స్‌లు మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకంగా కెరోటినాయిడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ల సమూహం శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను ఎదుర్కొంటాయి. వృద్ధాప్య ప్రక్రియలో , అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఈ ఫ్రీ రాడికల్స్ కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కజొన్నలొ అనేక ఇతక ధాన్యాలు, చిక్కుళ్ళు, కూరగాయల మాదిరిగానే, డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది.

READ ALSO : Monsoon Diet : వర్షకాలంలో ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా చేర్చుకోవడానికి 5 కారణాలు !

ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ కలిగిన మొక్కజొన్న తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి. మొక్కజొన్న వంటి అధిక మొత్తంలో పీచుపదార్థాలు తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. రక్తంలో చక్కెర, లిపిడ్లు, శరీర బరువును నియంత్రిస్తుంది. మొక్కజొన్న వంటి ఫైబర్ ఆహారంతోపాటు అధిక మొత్తంలో నీటిని తీసుకోవటం వల్ల మలబద్ధకం సమస్యను అధిగమించవచ్చు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాదపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.