కొత్త రకం వైరస్.. టిక్.. టిక్‌.. టైం బాంబ్‌ కంటే డేంజరస్? క్షణాల్లో వేగంగా వ్యాపించగలదు!

కొత్త రకం వైరస్.. టిక్.. టిక్‌.. టైం బాంబ్‌ కంటే డేంజరస్? క్షణాల్లో వేగంగా వ్యాపించగలదు!

Mutated Virus Is a Ticking Time Bomb : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా వైరస్.. రోజురోజుకీ ఊసరవల్లిలా రంగులు మార్చినట్టు రూపాంతరం చెందుతోంది. అంతకంతకు మ్యుటేషన్ అవుతూ మరింత ప్రాణాంకతంగా మారుతోంది. మ్యుటేట్ అయిన ప్రతిసారి కొత్త స్పైక్‌తో కొత్త లక్షణాలతో విజృంభిస్తోంది.. ఏ క్షణంలో వైరస్ ఎలా మ్యుటేట్ అవుతుందో తెలియదు.. ఒకేసారి టిక్.. టిక్ మనే టైం బాంబులా విస్పోటనం చెందొచ్చు. కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి డేటా అందుబాటులో లేదు. పాత కరోనా వైరస్‌లో కంటే ఈ కొత్త కరోనా వేరియంట్ వేగంగా వ్యాపిస్తొంది.. ప్రాణాంతకం కూడా అంటున్నారు పరిశోధకులు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొదట యూకేలో గుర్తించారు.

పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా వైరసులు ఎప్పటికప్పుడు మ్యుటేట్ అవుతున్నాయి. గతంలో వైరస్ ల కంటే ఈ కొత్త వేరింయట్ వెరీ డేంజరస్ అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. క్షణాల్లో వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఇప్పుడు ఒకటే ప్రశ్న అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్త వేరియంట్ పై టీకా పనిచేస్తుందో లేదా? మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాధమిక అధ్యయనం తర్వాత వ్యాక్సిన్ ప్రభావంతంగా కొత్త వేరియంట్ వైరస్ పై పనిచేయగలదని తేలడంతో కొంతవరకు ఉపశమనం లభించనట్టయింది. కానీ, కచ్చితంగా వ్యాక్సిన్ కొత్త వేరియంట్ ను నివారించగలదు అనడానికి మరింత డేటా అవసరమని అంటున్నారు సైంటిస్టులు. ఈ వేరియంట్ తీవ్రత టీకా సామర్థ్యాన్ని పెద్దగా తగ్గించదని అంటున్నారు.

ఈ కొత్త వేరియంట్ వైరస్.. ఎంత వరకు వ్యాప్తి చేయగలదు? కచ్చతంగా చెప్పలేం అంటున్నారు. కానీ, డేటా ప్రారంభ అంచనాలను పరిశీలిస్తే.. ఈ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కన్నా 50 నుంచి 70 శాతం ఎక్కువ వ్యాప్తి చేయగలదని సూచిస్తున్నాయి. వైరస్ పునరుత్పత్తి రేటు 1.1 ఇన్ఫెక్షన్ ప్రాణాంతక ప్రమాదం 0.8 శాతంగా ఉంది. మరణాల రేటు 50 శాతం పెరిగితే, పెద్ద సంఖ్యలో కరోనా మరణాలకు దారితీసే ప్రమాదం ఉంది. B.1.1.7గా పిలిచే ఈ వేరియంట్‌లో అసాధారణంగా పెద్ద సంఖ్యలో జన్యు మార్పులు ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు.

ముఖ్యంగా స్పైక్ ప్రోటీన్‌లో వైరస్ కణాలలోకి ప్రవేశిస్తుంది. కొత్త వేరియంట్ మన రోగనిరోధక ప్రతిస్పందనను ఎదుర్కోవడంలో మెరుగ్గా ఉండవచ్చు. వ్యాక్సిన్ల పంపిణీ ఆలస్యమయ్యే కొద్ది ఈ వేరియంట్ వేగంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి ప్రారంభంలోనే 50 మిలియన్ల నుంచి 100 మిలియన్ల మందికి టీకాలు వేసే అవకాశం ఉంది. అంటే.. అప్పటికి చాలా మంది ప్రాణాలను రక్షించవచ్చు. MRNA టీకాలు రోగలక్షణ వ్యాధిని 95 శాతం తగ్గించాయని తేలింది. రోగలక్షణాలు లేనివారిలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు.