Essential Medical Tests : 30 లేదా 40 ఏళ్లు వచ్చినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటున్న వైద్యులు ! ఎందుకంటే ?

సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వంటి క్లిష్టమైన జన్యుపరమైన అనారోగ్యం, రక్తపోటు, మధుమేహం మరియు ఆకస్మిక మరణ చరిత్ర మొదలైన కొన్ని రుగ్మతల వంటి కుటుంబ చరిత్ర ఉంటే తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు నిర్దిష్ట మైన పరీక్షలు చేయించుకోవటం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Essential Medical Tests : 30 లేదా 40 ఏళ్లు వచ్చినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటున్న వైద్యులు ! ఎందుకంటే ?

Essential Medical Tests

Essential Medical Tests : వయస్సుతోపాటు, శరీరంలోని అవయవాల పనితీరులో కూడా మార్పు ప్రారంభమవుతుంది. జీవనశైలి సక్రమంగా లేకుంటే ఈ మార్పులు మరింత వేగవంతం అవుతాయి. అనేక సందర్భాల్లో వృద్ధాప్య ప్రక్రియ కూడా త్వరితగతిన చేరువవుతుంది.యువకులుగా ఉన్న సమయంలో సాధారణంగా తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. తమకేమవుతుందిలే అన్న నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తారు. పూర్తిస్థాయి వ్యాధి ఉధృతరూపం దాల్చేవరకు అంతర్లీన సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు.

READ ALSO : Heart Health : గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

ఈ రోజుల్లో ఆకస్మిక గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్‌ల పెరగటానికి ముఖ్యకారణం కూడా మన నిర్లక్ష్యమే. వ్యాధి తీవ్రత లక్షణాలు కనిపించటానికి ఎక్కువ సమయం పడుతుంది. ముందస్తు సంకేతాలను గ్రహించి వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి, దానిని నయం చేసుకోవటానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం.కుటుంబాలలో ఎవరికైన గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ చరిత్ర ఉన్న ఉంటే ముఖ్యంగా అవసరమైన పరీక్షలను ఆలస్యం చేయకూడదు. ఇలా చేయటం వల్ల వ్యాధిని మొగ్గలోనే తుడిచిపెట్టి త్వరగా చికిత్స ప్రారంభించటానికి అవకాశం ఉంటుంది.

కొత్త వైరస్‌లు, అనారోగ్యాలు పుట్టుకొస్తుండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో మానవ జీవితం పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన శరీరం మాత్రమే వివిధ పర్యావరణ మరియు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలదు. వయస్సుతో పాటు, శరీరం యొక్క రోగనిరోధక శక్తి , వైద్యం సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా వైద్య సలహాను పొందటంతోపాటు, ఫిట్‌గా ఉండటానికి క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

READ ALSO : Liver Health : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలతో పండించిన ఆహారం వద్దు!

ఈ ప్రాథమిక పరీక్షలను 30 ఏళ్ల తర్వాత లేదంటే 40 ఏళ్ల తర్వాత గుండెకు సంబంధించిన కొన్ని పరీక్షలను చేయించుకోవాలని సికె బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ తాయల్ సూచిస్తున్నారు. సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వంటి క్లిష్టమైన జన్యుపరమైన అనారోగ్యం, రక్తపోటు, మధుమేహం మరియు ఆకస్మిక మరణ చరిత్ర మొదలైన కొన్ని రుగ్మతల వంటి కుటుంబ చరిత్ర ఉంటే తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు నిర్దిష్ట మైన పరీక్షలు చేయించుకోవటం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాగని అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు, వైద్యుల సూచనల మేరకు ఏవి అవసరమో తెలుసుకోని వాటిని చేయించుకోవటం మంచిది.

40 ఏళ్లలోపు వారు అలసట, తక్కువ నిద్ర, చెదిరిన నిద్ర, రెండు వారాల కంటే ఎక్కువ తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, పదేపదే జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వం, తిమ్మిర్లు, కళ్లు పొడిబారడం, వంటి లక్షణాలు బాధిస్తుంటే తప్పనిసరిగా నిర్దిష్ట పరీక్షలను వైద్యుల సిఫార్సు మేరకు చేయించుకోవాలి.

READ ALSO : Medico Preethi : పూర్తిగా చెడిపోయిన కిడ్నీలు, అత్యంత విషమంగా ప్రీతి పరిస్థితి

ఏ వయస్సులో పూర్తి ఆరోగ్య పరీక్ష అవసరం ;

42 సంవత్సరాల వయస్సు తర్వాత మరియు 60 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి రెండు సంవత్సరాలకు పూర్తి స్ధాయిలో ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలను వైద్యులు సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆరోగ్య తనిఖీలు తప్పనిసరి. ప్రమాద కారకమైన లక్షణాలు కనిపించినా, శరీరంలో ఇతర అసౌకర్యం విషయంలో, వైద్య నిపుణుడి నుండి సలహా తీసుకున్న తర్వాత పరీక్ష చేయించుకోవాలి. 30 ఏళ్ల వయస్సులో తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షల జాబితాను, 40 ఏళ్లు పైబడిన వారికి కొన్ని అదనపు పరీక్షలను నిపుణులు సూచిస్తున్నారు.

1. రక్తపోటు పర్యవేక్షణ: రక్తపోటును ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అవసరం. కుటుంబచరిత్రలో రక్తపోటు ఉన్నవారుంటే వారసులు కూడా రక్తపోటును చెక్ చేసుకుంటుండాలి. సాధారణంగా బీపీ 130/84 mm Hg కంటే తక్కువగా ఉండాలి.

2. మధుమేహ పరీక్ష : మధుమేహా పరిక్ష అనేది నిశ్ఛల జీవనశైలి, ఊబకాయం , కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులు ఏడాదికి ఒకసారైనా చేయించుకోవాలి. ఒక వ్యక్తి 5.7 కంటే తక్కువ HBA1C విలువతో నాన్‌డయాబెటిక్, 6.3 వరకు ప్రీడయాబెటిక్ మరియు 6.4 కంటే ఎక్కువ డయాబెటిక్ గా చెప్పవచ్చు.

READ ALSO : Prevent Skin Cancer : ఎండవేడి కారణంగా వచ్చే చర్మ క్యాన్సర్‌ను నివారించడానికి చిట్కాలు, జాగ్రత్తలు !

3. కాలేయ పనితీరు పరీక్ష: దీర్ఘకాలిక కాలేయ వ్యాధి మరియు కొవ్వు కాలేయ వ్యాధిని నివారించుకోవటానికి ఇది ఏటా చేయవచ్చు.

4. థైరాయిడ్ పనితీరు పరీక్ష: బరువు పెరగడం, జుట్టు రాలడం మరియు క్రమరహిత రుతుక్రమం వంటి అండర్యాక్టివ్ థైరాయిడ్ లక్షణాలు ఉంటే, మీరు తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాలి.

5. విటమిన్ D మరియు B12: ఇది ఏటా చేయవచ్చు. లోపం ఉన్నట్లయితే తగిన సప్లిమెంట్లను ,ఆహార మార్పులను అమలు చేయవచ్చు.

6. లిపిడ్ ప్రొఫైల్: ముఖ్యంగా ఒకేచోట కూర్చుని ఉండే వ్యక్తు, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఈ పరీక్ష ముఖ్యమైనది. LDL కొలెస్ట్రాల్ ఆదర్శంగా 100 కంటే తక్కువగా ఉండాలి  HDL అధిక సాధారణ పరిధిలో ఉండాలి.

READ ALSO : Skin Beauty : వేసవిలో ఎండవేడి నుండి చర్మసౌందర్యాన్ని కాపాడే ఫేస్ పాక్స్‌!

7. పొత్తికడుపు పరీక్ష : కొవ్వు కాలేయం, గాల్ బ్లాడర్, కిడ్నీ పాలిప్స్ చరిత్ర కలిగిన వ్యక్తులలో ఇది ప్రతి ఏటా చేయవచ్చు.

8. రొమ్ము అల్ట్రాసౌండ్: 40 సంవత్సరాల వయస్సు వరకు రొమ్ము క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని నివారించటానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి దీన్ని చేయించుకోవటం ఉత్తమం.

9. పాప్ స్మెర్ పరీక్ష: గర్భాశయ క్యాన్సర్ యొక్క ప్రారంభ మార్పులను గుర్తించడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి దీనిని చేయించుకోవటం మంచిది.

10. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల కోసం స్క్రీనింగ్: ఇది అధిక-ప్రమాద సమూహాలకు చెందిన వ్యక్తులలో ప్రతి ఏటా చేయించుకోవటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.