టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది : బీజేపీ లక్ష్మణ్

టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: chvmurthy ,Published On : April 13, 2019 / 11:39 AM IST
టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది : బీజేపీ లక్ష్మణ్

టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అక్రమ వలస దారులను గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే  దాన్నికూడా రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు.

జాతీయ భావాలను ప్రశ్నిస్తూ, తండ్రి కొడుకులిద్దరూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్ధి గెలవబోతున్నాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో స్పృష్టమైన రాజకీయప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తుందని ఆయన చెప్పారు.  
Read Also : బెంగాల్ లో అడుగుపెట్టొద్దు : రాహుల్ కు నో ఎంట్రీ అంటున్న మమత

మత్మోన్మాద ఎంఐఎంతో జట్టుకట్టి  హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇస్తున్నారు అని కేసీఆర్ పై ఆగ్రహం  వెలిబుచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో హిందూవులను అవమానపరిచేలా, సైన్యాన్యాన్ని కించపరిచేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేసారని ఆయన అన్నారు.

అసదుద్దీని ఒవైసీ….  సర్కారును నడిపేది కారు పార్టీ అయినా, ఆ కారు..  స్టీరింగ్ నాచేతిలో ఉందని వ్యాఖ్యానిస్తే ఏమీ మాట్లాడలేని స్ధితిలో తండ్రి, కొడుకులిద్దరూ కుమ్మక్కయ్యారని లక్ష్మణ్ ఆరోపించారు. దేశంలోకి చొరబడ్డ అక్రమ వలస దారులను వెనక్కి పంపుతామని అమిత్ షా వ్యాఖ్యానిస్తే దానికి కూడా అనవసర వ్యాఖ్యానాలు చేస్తూ దేశ భద్రతను ప్రశ్నిస్తున్నారని అన్నారు.